iDreamPost
android-app
ios-app

తనను తానే పెళ్లాడిన మహిళ.. కారణం తెలిస్తే షాక్!

  • Published Oct 14, 2023 | 4:45 PM Updated Updated Oct 14, 2023 | 4:45 PM
  • Published Oct 14, 2023 | 4:45 PMUpdated Oct 14, 2023 | 4:45 PM
తనను తానే పెళ్లాడిన మహిళ.. కారణం తెలిస్తే షాక్!

ప్రతిఒక్కరి జీవితంలో వివాహం అనేది మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా వారి వారి జీవితాల్లో పెళ్లికి ఉండే ప్రత్యేకతే వేరు. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు. తమ అభిరుచులకు తగిన వరుడు లేదా వధువును ఎంచుకుని అంగరంగవైభవంగా పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతుంటారు. ఇదే విధంగా ఓ యువతి 20 ఏళ్ల వయసు నుంచే పెళ్లి చేసుకోవాలని తను కలలుగన్న రాకుమారుడి కోసం వెతకసాగింది. ఈ వెతుకులాటలోనే 20 ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ తనకు సరైన వరుడు దొరకలేదు. దీంతో ఆ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా తనను తానే వివాహమాడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొంతమంది యువతీ యువకులు తమకు కాబోయే భార్య లేదా భర్త ఇలాగే ఉండాలని మొండి పట్టుతో ఉంటారు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఓపట్టాన మెచ్చరు. ఈ క్రమంలోనే పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుంది. ఇదే విధంగా లండన్ కు చెందిన 42 యేళ్లా సారా విల్కిన్సన్ తనకు సరియైన ఈడు జోడైన వరుడి కోసం జల్లెడ పట్టింది. మరోవైపు తన వివాహాన్ని కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోవాలని 20 ఏళ్లుగా డబ్బు సంపాదిస్తూ కూడబెట్టింది. డబ్బైతే జమయ్యింది కానీ తనకు కావాల్సిన లక్షణాలున్న వరుడు మాత్రం దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందింది సారా. ఈ క్రమంలో సంపాదించిన డబ్బంతా ఏం చేయాలి.. ఎవరికోసం ఖర్చు పెట్టాలి అని ఆలోచనలో పడింది. వరుడు లేకున్నా సరే తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అనుకున్నదే తడవుగా తన పెళ్లి పనులకు శ్రీకారం చుట్టింది సారా. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను అందరికి ఆహ్వానాలు పంపింది. 2023 సెప్టెంబర్ 30న ఇప్పటి వరకు ఎవరూ చేసుకొని రీతిలో తనను తానే పెళ్లాడింది. ఆమె పెళ్లి వేడుకలో 40 మంది వరకు బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. సఫోల్క్‌లోని ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి హాజరైన వారికి గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చింది. సారా విల్కిన్సన్ ఈ పెళ్లి వేడుక కోసం సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet