iDreamPost

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..5 రోజులు వైన్ షాపులు క్లోజ్!

Wine Shops Close: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే తరచూ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారికి అలాంటి వార్తే వచ్చింది.

Wine Shops Close: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే తరచూ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారికి అలాంటి వార్తే వచ్చింది.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..5 రోజులు వైన్ షాపులు క్లోజ్!

నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. ఏ చిన్న ఫంక్షన్ చేసిన చుక్క తప్పని సరిగా ఉండాల్సిందే. అదిలేని పార్టీయే లేదు అంటే అతిశయోక్తి కాదు. అలానే ప్రతి నలుగురు దోస్తులు కలిస్తే.. ఎక్కువ పెట్టే ప్రోగ్రామ్ మందు తాగడం. అలానే వీకెండ్ వచ్చిందంటే.. మందుబాబులకు పండుగనే.  ఇంకా చెప్పాలంటే.. కొందరి మందు పడనిదే.. రోజు ప్రారంభం కాదు. అలానే రోజు ముగియదు. ఇలాంటి మద్యంలో మునిగిపోయే ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్. ఏకంగా ఐదు రోజులు మద్యం షాపులు మూత పడనున్నాయి. అయితే ఈ మద్యం షాపుల క్లోజ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదులే. మరి.. ఎక్కడ ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నెల రోజుల నుంచి ఈ హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. త్వరలో చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమమంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. ఇక ఎన్నికల పోలింగ్ కి రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు క్లోజ్ చేసే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎక్కడ ఎన్నికల పోలింగ్ జరిగేతే అక్కడ రెండు రోజుల ముందు మద్యం షాపులను మూసేస్తున్నారు. గతంలో తెలగాణ, ఆంధ్రలో మద్యం షాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎన్నికల నేపథ్యంలోనే  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో మద్యం, బీరు షాపులు బంద్ కానున్నాయి.

జూన్ 4వ తేదీన లోక్‌ సభ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే బెంగళూరు నగరంలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. మొత్తం ఐదు రోజులు పాటు బెంగళూరు సిటీలో మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. జూన్‌ 1 వ తేదీ నుండి 6వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌, ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు, ఆ తరువాత వాటి కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో వరుసగా జూన్‌ 1 నుండి 6 వరకు వైన్స్‌, బార్లు, పబ్‌లను మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలానే మద్యం అమ్మకలపై నిషేధాన్ని విధిస్తూ కీలక హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా రానున్న ఐదు రోజుల పాటు బెంగళూరు నగంరో మద్యం షాపులు మూతపడనున్నాయి.  జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మూడు రోజు వ్యవధిలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి