iDreamPost
android-app
ios-app

అన్ సీజన్‌లో గోవాని ఆదుకుంటున్న భార్య బాధితులు! అందరూ వాళ్లేనట!

Wife Victims In Goa: గోవా అంటే ఒకప్పుడు బీచ్ లకి ఫేమస్.. కానీ ఇప్పుడు భార్య బాధితులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. పరిస్థితి చూస్తే అలానే ఉంది మరి. వీళ్ళు గోవా వెళ్లడమే కాకుండా సోసోగా ఉన్న గోవా ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా భార్య బాధితులంతా కలిసి అమాంతం పెంచేశారు.

Wife Victims In Goa: గోవా అంటే ఒకప్పుడు బీచ్ లకి ఫేమస్.. కానీ ఇప్పుడు భార్య బాధితులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. పరిస్థితి చూస్తే అలానే ఉంది మరి. వీళ్ళు గోవా వెళ్లడమే కాకుండా సోసోగా ఉన్న గోవా ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా భార్య బాధితులంతా కలిసి అమాంతం పెంచేశారు.

అన్ సీజన్‌లో గోవాని ఆదుకుంటున్న భార్య బాధితులు! అందరూ వాళ్లేనట!

గోవాని ఆదుకుంటున్న భార్య బాధితులా? వాళ్ళే ఒకరి వల్ల బాధితులయ్యారు. వాళ్లనే ఒకరు ఆదుకునే పరిస్థితి. అలాంటిది వాళ్ళు ఒక సిటీని ఆదుకోవడమా? ఛాన్సే లేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంట్లో పిల్లులుగా ఉన్న భర్తలు చాలా మంది బయట పులులుగా చెలామణి అవుతారు. అందుకే ఆర్థికంగా డల్ గా ఉన్న గోవా టూరిజంని ఆదుకున్నారు. ఇంట్లో భార్య పెట్టే టార్చర్ భరించలేక గోవా తల్లి ఒడిలో చేరిపోయారు వీరంతా. గోవాకి తెగ సంపద కురిపించారు ఈ భార్య బాధితులందరూ. గోవా.. దేశంలో అద్భుత టూరిజం స్పాట్ గా ఉంది. చిల్ అవ్వడానికి గోవా వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్కువగా బ్యాచిలర్స్ వెళ్తుంటారు. ఈసారి ఎక్కువగా పెళ్ళైన మగాళ్లు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఒక్క సీజన్ లోనే ఏకంగా కోటి మంది గోవా వెళ్లారట. అది కూడా సీజన్ కాని సీజన్ లో వెళ్లడం గమనార్హం. కోవిడ్ వచ్చాక గోవా టూరిజం పరిస్థితి అంతగా బాలేదు. కోవిడ్ 19 నుంచి గోవా టూరిజం సోసోగానే ఉంది. అయితే ఎప్పుడైతే భార్య బాధితులు గోవాకి పోటెత్తారో అప్పుడే రికార్డు స్థాయిలో గోవా టూరిజం సంపద పెరిగింది. గోవాకి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏకంగా కోటి మార్క్ టచ్ చేసిందని గోవా టూరిజం మినిస్టర్ రోహన్ వెల్లడించారు. కోవిడ్ 19కి ముందు ఉన్న దానికంటే ఇప్పుడు పర్యాటకుల తాకిడి ఈసారి 150 శాతం పెరిగిందని అన్నారు. వర్షాకాలంలో గోవాలోని హోటల్స్ అన్నీ 80 శాతం బుక్ అయ్యాయని.. గోవా అంటే కేవలం బీచ్ లే కాదని గుర్తించడం వల్లే వర్షాకాలంలోనూ పర్యాటకులు పోటెత్తారని అన్నారు. దీంతో గోవా రాష్ట్రానికి ఈ సీజన్ లో బీభత్సమైన ఆదాయం వచ్చింది.

అయితే ఈ క్రెడిట్ మొత్తం భార్య బాధిత భర్తలది, అలానే బ్యాచిలర్స్ ది అని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే ఎక్కువ మంది మగవాళ్లే ఈ సీజన్ లో వెళ్లారు. అందులో పెళ్ళైన మగవాళ్ళు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది భర్తలు ప్రశాంతంగా గడిపేందుకు గోవా ట్రిప్ వేశారని చెబుతున్నారు. ఇది చూసి మరింత మంది గోవాకి క్యూ కడుతున్నారు. విదేశీ టూరిస్టులు కూడా ఈసారి అధిక శాతంలో గోవా వచ్చారు. మాల్దీవ్స్ వివాదం తర్వాత అందరూ భారతీయ పర్యాటక ప్రదేశాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు.

దీంతో గోవా కూడా హాట్ డెస్టినేషన్ హబ్ గా మారిపోయింది. ఈ వర్షాకాలంలో గోవాలో వాటర్ ఫాల్స్, పచ్చని గ్రామాలు, అడవులు, గ్రామీణ టూరిజం వంటివి ఆస్వాదించవచ్చు. ఏది ఏమైనా గానీ గోవా అంటే బీచ్ లు మాత్రమే కాదు.. అంతకు మించి అని ఈ బ్యాచిలర్లు, భార్య బాధితులు గుర్తించి గోవా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. గోవాలో కోటి పైనే పర్యాటకులు రావడంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ కూడా చక్కెర్లు కొడుతున్నాయి. ఈ క్రెడిట్ మొత్తం బ్యాచిలర్స్ ది, భార్య బాధితులది అంటూ మీమ్స్ వేస్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి