iDreamPost
android-app
ios-app

భర్త అయోధ్యకు తీసుకెళ్లాడని భార్య విడాకులు.. కారణం..?

  • Published Jan 25, 2024 | 6:24 PM Updated Updated Jan 25, 2024 | 7:20 PM

కొత్తగా పెళ్లైన వధూవరులు.. హనీమూన్ కోసం బయట ప్రాంతాలకు వెళుతుంటారు. దీని కోసం ముందు నుండి ప్రణాళికలు వేసుకుంటారు. భర్తతో ఏకాంతంగా గడిపే మధురమైన క్షణాల కోసం భార్య ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఈ భర్త..

కొత్తగా పెళ్లైన వధూవరులు.. హనీమూన్ కోసం బయట ప్రాంతాలకు వెళుతుంటారు. దీని కోసం ముందు నుండి ప్రణాళికలు వేసుకుంటారు. భర్తతో ఏకాంతంగా గడిపే మధురమైన క్షణాల కోసం భార్య ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఈ భర్త..

  • Published Jan 25, 2024 | 6:24 PMUpdated Jan 25, 2024 | 7:20 PM
భర్త అయోధ్యకు తీసుకెళ్లాడని భార్య విడాకులు.. కారణం..?

కొత్తగా పెళ్లైన వధూ వరులకు అచ్చట ముచ్చట ఉంటుంది. అందుకే ఇరువురి పేరెంట్స్ ఎంజాయ్ చేయమని హనీమూన్ పేరిట బయటకు పంపిస్తుంటారు. సాధారణంగా హనీమూన్ కోసం నూతన దంపతులు ముందుగానే తమ డెస్టినీని వెతుక్కుంటూ ఉంటారు. హిల్ స్టేషన్స్, సముద్ర తీర ప్రాంతాలను ఎంచుకుంటూ ఉంటారు. భర్తతో ఏకాంతంగా గడపాలని, తనతో అన్ని విషయాలు పంచుకోవాలని ఆరాటపడుతుంటారు కొత్తగా పెళ్లైన అమ్మాయిలు. పరిచయం లేని వ్యక్తి.. అతడి గురించి ఏమీ తెలియని ఓ అమ్మాయి.. హనీమూన్ మంచి అవకాశంగా భావిస్తూ ఉంటుంది. అతడి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇదిగో ఓ కొత్త పెళ్లికూతురు కూడా అలానే ఆశపడింది.

కానీ ఆమె ఆశలు అడియాశలు చేశాడో భర్త. వెంటనే విడాకులు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఆ భర్త చేసిన నేరం ఏమిటంటే.. హనీమూన్‌కు గోవా తీసుకెళతానని అయోధ్యలోని నూతనంగా నిర్మించిన రామాలయానికి తీసుకెళ్లాడట. ఇంకేముంది భార్యకు చిర్రెత్తుకు వచ్చి.. డివోర్స్ అంది. ఇంతకు ఆ భార్యా భర్తలదీ ఎక్కడంటే.. మధ్యప్రదేశ్. ఓ జంటకు ఐదు నెలల క్రితం పెళ్లైంది. అయితే హనీమూన్ కోసం తనను గోవా తీసుకెళతానని ప్రామిస్ చేశాడు భర్త. దీంతో ఊబ్బితబ్బిబ్బు అయిపోయింది భార్య. నా భర్త ఎంత మంచోడో అంటూ మురిసిపోయింది. కానీ అతడు ఆమెను అయోధ్యలోని రామాలయంతో పాటు వారణాసి తీసుకెళ్లాడు. పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పతికి షాక్ ఇచ్చింది సతి.

డివోర్స్ కాగితాలను ఇచ్చింది. కాగా, ఆమె భర్త ఐటి ఉద్యోగి, ఆమె కూడా బాగానే సంపాదిస్తుంది. అయితే వీరిద్దరూ కలిసి విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేయాలని భార్య కోరగా.. తన తల్లిదండ్రులను చూసుకోవాలని, గోవా లేదా దక్షిణ భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళదామని చెప్పాడు.  ఆమె గోవా అని ఫిక్స్ అయిపోయింది. అదే సమయంలో భార్యకు చెప్పకుండా అయోధ్య, వారణాసికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. రామ మందిర శంకు స్థాపన కార్యక్రమానికి ముందు తన తల్లి ఆ నగరాన్ని చూడాలని ఆశపడుతుందని, ప్రయాణం ఒక్క రోజు ఉంది అనగా భార్యకు చెప్పాడు. దీంతో ఒక్క మాట మాట్లాడకుండా.. వారితో పాటు వెళ్లింది. కానీ వచ్చాక భర్త నుండి విడాకులు కావాలంటూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన కంటే.. తన కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాడని.. ఇలాంటి వాడితో కాపురం చేయలేనని పేర్కొంది భార్య. ప్రస్తుతం ఈ జంటకు భోపాల్ ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్ జరుగుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş