iDreamPost
android-app
ios-app

వీడియో: చెట్టంత భర్తకు విమానంలో చెమటలు పట్టించిన భార్య!

  • Published Aug 08, 2023 | 6:20 PM Updated Updated Aug 08, 2023 | 6:44 PM
  • Published Aug 08, 2023 | 6:20 PMUpdated Aug 08, 2023 | 6:44 PM
వీడియో: చెట్టంత భర్తకు విమానంలో చెమటలు పట్టించిన భార్య!

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అనేది మామూలే. దంపతల మధ్య చిన్నపాటి కొట్లాటలు జరిగితేనే.. వారి  ప్రేమానుబంధం పెరుగుతుందని చాలామంది చెబుతుంటారు. అదే గొడవలు పెరిగి పెద్దవి అయితే దాంపత్య బంధం తెగిపోతుందని చెబుతున్నారు. అలానే చాలా మంది దంపతులు ఇంట్లోనే గొడవ పడుతుంటారు. కొందరు భార్యలు మాత్రం పబ్లిక్ ప్రాంతాల్లో గొడవలు పెట్టుకుని.. పరువు తీసుకుంటారు. ఇలాంటి భార్య నాకు వద్దురా.. దేవుడా! అని భర్తలు అనుకునేలా ప్రవర్తింస్తుంటారు. తాజాగా ఓ భార్య.. ఏకంగా విమానంలోనే భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో నన్ను కాపాడంటూ భర్త.. విమాన సిబ్బందిని పిలిచాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది.

వైరల్ మారిన వీడియోను మనం చూసినట్లయితే.. ఇద్దరు యువ దంపతులు విమానంలో ప్రయాణిస్తున్నారు. మరి.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆ దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరి మధ్య నెలకొన్న చిన్న గొడవ చినికి చనికి గాలివానగా మారింది. ఆమె అయితే తన భర్తపై ఓ రేంజ్ లో మాటల యుద్ధం చేసింది. కోపంతో అతడు తన భార్యను చెప్పుతో కొట్టేందుకు సిద్ధపడ్డాడు. అయితే ఆమె కూడా నేను ఏమి తక్కువ తినలేదు.. అన్నట్లు అతడిపైకి చేయి ఎత్తి దాడి చేయబోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త వెంటనే విమానంలోని సిబ్బందిని సహాయం కోసం కేకలు వేశాడు. “నా భార్య గొడవ పడుతోంది. ప్లీజ్ నన్ను కాపాడండి” అంటూ పెద్ద పెద్దగా అరిచాడు.

అతడి అరుపులకు తోటి ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోయారు. మరికొందరు అతడిని చూసి నవ్వుకున్నారు. మరికొంత మంది ప్రయాణికులు పగలబడి పెద్దగా నవ్వుకోవటం వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజ్లను అనేక కామెంట్స్ చేస్తున్నారు. “ఇలా పబ్లిక్ ఏరియాలో గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రజలను అలరిస్తుంది, మీ మర్యాదలను పోగొడుతుంది” అంటూ కామెంట్స్ చేశారు. ఇంటి పనుల నుంచి కారు కిటికీ తెరవడం వరకు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sunny Aryaa (@tehelkaprank)

ఇదీ చదవండి: వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ కుమార్తె!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobet