iDreamPost
android-app
ios-app

అనంత్ పెళ్లిలో వీణా వాణి ప్రదర్శన!

Veena Srivani In Anant Ambani Wedding: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పుణ్యమా అంటూ వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా ఆమె అరుదైన అవకాశం సంపాదించింది.

Veena Srivani In Anant Ambani Wedding: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పుణ్యమా అంటూ వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా ఆమె అరుదైన అవకాశం సంపాదించింది.

అనంత్ పెళ్లిలో వీణా వాణి ప్రదర్శన!

ప్రస్తుతం దేశ మొత్తం ముఖేశ్ అంబానీ వాళ్ల ఇంట్లో జరిగే పెళ్లి గురించే హాట్ టాపిక్ జరుగుతోంది. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈ వివాహానికి హజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుక అనేక మందితో వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబాని ఇంట జరిగే పెళ్లిలో ప్రదర్శన చేసే అవకాశం చాలా తక్కువ మందికే లభిస్తుంది. అలాంటి ఛాన్స్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సతీమణి వీణశ్రీవాణికి దక్కింది. ఆ పెళ్లిలో తన ప్రదర్శన ఇవ్వడంపై చాలా సంతోషం వ్యక్తం చేసింది.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ఈయన చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొందరు టాలీవుడ్ ప్రముఖల విడాకులకు సంబంధించి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వేణు స్వామి భార్య కూడా బాగానే ఫేమస్ అయ్యారు. ఆయన పుణ్యమా అంటూ వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.

వీణ శ్రీవాణి.. వీణ వాయించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తరచూ తన ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంది.  ఇది ఇలా ఉంటే.. ఆమెకు అరుదైన అవకాశం లభించింది. ముఖేశ్ అంబానీ ఇంట జరిగే పెళ్లిలో ఆమె ప్రదర్శన చేసే అవకాశం దక్కింది. అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు, ఏదైనా ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం దొరకడం చాలా కష్టం. అలాంటి ముకేశ్ అంబానీ దృష్టిలో శ్రీవాణి ప్రదర్శనలు పడ్డాయి. దీంతో ఏకాంగా అంబానీ ఇంట జరిగే పెళ్లిలో ఆమె వీణను వాయించనున్నారు.

ఈ  విషయంపై వీణా శ్రీవాణి మాట్లాడుతూ..” ఈ రోజు అంబానీ ఫ్యామిలీలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతుంది. ఈ పెళ్లి వేడుక జరిగిన ఇన్ని రోజుల్లో తెలుగు వారు వచ్చి ఎవరు ప్రదర్శన ఇచ్చారో నాకు తెలియదు కానీ.. సరిగ్గా పెళ్లి జరగబోతున్న రోజు… తెలుగు వాళ్ల తరపున నేను వచ్చి..వీణ ప్రదర్శన ఇవ్వబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మాకోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, మా ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక నా డ్రెస్ విధానం వచ్చే సరికి…నీతు అంబానీ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఆవిడ సెలక్ట్ చేసిన ప్రకారమే నేను రెడి అయ్యాను. సాయంత్రం మన వీణ ప్రదర్శన అద్భుతం జరుగుతోందని, అందరూ మన తెలుగు సంప్రదాయమైన ఈ ప్రదర్శను తిలకిస్తారని ఆశిస్తున్నాను” అని ఆమె తెలిపారు.