iDreamPost
android-app
ios-app

రూ.500 నోట్లపై పడుకొని ఫొటో దిగాడు! జీవితం రోడ్డుపైకి వచ్చేసింది!

ఇటీవల కాలంలో దర్యాప్తు సంస్థలు సోదాలు, అరెస్ట్లు, నోటీసులతో రాజకీయ నేతలను హడలెత్తిస్తున్నాయి. అవినీతి సొమ్మును కూడబెట్టిన వారిని అరెస్టు చేసి విచారిస్తున్నాయి. మరో పక్క ఓ రాజకీయ నాయకుడు విచిత్ర చర్యలతో నెట్టింట హల్ చల్ సృష్టిం చాడు.

ఇటీవల కాలంలో దర్యాప్తు సంస్థలు సోదాలు, అరెస్ట్లు, నోటీసులతో రాజకీయ నేతలను హడలెత్తిస్తున్నాయి. అవినీతి సొమ్మును కూడబెట్టిన వారిని అరెస్టు చేసి విచారిస్తున్నాయి. మరో పక్క ఓ రాజకీయ నాయకుడు విచిత్ర చర్యలతో నెట్టింట హల్ చల్ సృష్టిం చాడు.

రూ.500 నోట్లపై పడుకొని ఫొటో దిగాడు! జీవితం రోడ్డుపైకి వచ్చేసింది!

ప్రతి ఒక్కరి  ఏదో ఒక హాబీ ఉంటుంది.  క్రికెట్, రీడింగ్ బుక్స్, పోటోలు దిగడం, వీడియో చేయడం వంటి అనేక రకాల హాబీలు ఉంటాయి. ఇంకొందరు తాము వార్తల్లో నిలిచేందుకు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఇటీవలే హోళీ సందర్భంగా కొందరు యువతలు చేసిన రచ్చ అందరికి తెలిసిందే. అలా తాము ఏదో చేయాలని  అనుకుంటే చివరకు మరెదో జరిగింది. అలానే తాజాగా ఓ రాజకీయ నేత నోట్లను ఒంటిపై పెట్టుకుని దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫోటో సదరు నేతను చివరకు ఇరకాటంలో పెట్టింది.

సమాజంలో ధనవంతులు, పేద వాళ్లు అనే వర్గాలు ఉంటాయి. ఎన్నో కుటుంబాలు డబ్బులు లేక ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డబ్బుల  కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ఒక నోటు అయినా సరే చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఇలా డబ్బుల కోసం ఎంతో మంది కష్టపడుతుంటే..మరికొందరు మాత్రం అవినీతి సంపాదనతో రాజభోగాలు అనుభవిస్తుంటారు. మరికొందరు అయితే తాము సంపాదించిన సొమ్ముతో చిత్రవిత్రమైన పనులు చేస్తుంటారు. నోట్లను రోడ్లపై వెదజల్లడం, వాటితో ఫోటోలు దిగడం వంటివి చేస్తుంటారు. తాజాగా అలానే ఓ రాజకీయ నాయకుడు రూ.500 నోట్లను మీద వేసుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలోని వైరాగురి వీసీడీసీ చైర్మన్  బెంజిమన్ బసుమతరీకి సంబంధించిన ఓ ఫొటో ఇంటర్నెట్ లో  ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో బసుమతరీ 500 రూపాయల నోట్లపై పడుకుని, వాటితో కప్పుకున్నట్లు ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ఆయనకు ఇంత డబ్బు ఎక్కడిది.. అక్రమ సంపాదన ఏమైనా ఉందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. బెంజిమన్ బాసుమతరి.. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్  పరిధిలోని యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ నాయకుడు.

అయితే బాసుమతరీకి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో యూపీపీఎల్ పార్టీ అధ్యక్షుడు.. బాసుమతరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి అప్రతిష్ట కలిగేలా బాసుమతరి వ్యవహరించాడని..అతనిపై విచారణకు ఆదేశించారు.  ఇదే సమయంలో ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆయన తీరుపై భగ్గున మండిపడుతున్నారు. గతంలోనూ ఇలా డబ్బులతో చిత్రమైన వేషాలు వేసిన ఘటనలు ఉన్నాయి. నడి రోడ్డుపై కార్లో వెళ్తా..నోట్లను చల్లడం,నోట్లతో  ఒళ్లు కప్పుకోవడం వంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఇలా నోట్లనే ఒంటిపై వేసుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సామాన్యులను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మరి.. ఈవీడియోను మీరు చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.