iDreamPost
android-app
ios-app

 పెళ్లిలో రక్తదాన శిబిరం.. ఆదర్శంగా నిలిచిన నూతన దంపతులు!

  • Published Jan 25, 2024 | 5:55 PM Updated Updated Jan 25, 2024 | 5:55 PM

సాధారణంగా పెళ్లి వేడుకల్లో బహుమతలు ఇచ్చిపుచ్చుకోవడమనేది సహజం. అయితే బీహార్ లో విచిత్రమైన కానుకల డిమాండ్ తో ఒక వివాహం జరిగింది. స్థానికంగా ఇది చర్చకు దారితీయడంతో పాటు పదిమందికీ ఆదర్శంగా నిలిచింది.

సాధారణంగా పెళ్లి వేడుకల్లో బహుమతలు ఇచ్చిపుచ్చుకోవడమనేది సహజం. అయితే బీహార్ లో విచిత్రమైన కానుకల డిమాండ్ తో ఒక వివాహం జరిగింది. స్థానికంగా ఇది చర్చకు దారితీయడంతో పాటు పదిమందికీ ఆదర్శంగా నిలిచింది.

  • Published Jan 25, 2024 | 5:55 PMUpdated Jan 25, 2024 | 5:55 PM
 పెళ్లిలో రక్తదాన శిబిరం.. ఆదర్శంగా నిలిచిన నూతన దంపతులు!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా మధురమైన ఘట్టం. ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత కోరుకుంటారు. ఇక పెళ్లి పత్రిక మొదలు, మండపం, భోజనాల వరకు ప్రతిదీ వెరైటీగా ఉండాలని  భావిస్తుంటారు. అలానే యువత తల్లిదండ్రులు కూడా  తమ బిడ్డల వివాహలు ఘనంగా జరిపించాలని కోరుకుంటారు. అయితే కొన్ని కుటుంబాలు, యువత మాత్రం తమ పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావిస్తుంటారు. ఈక్రమంలోనే పెళ్లి సమయంలోనే పలు సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ఓ నూతన వధువరులు పెళ్లిలో రక్తదాన శిబిరం నిర్వహించి..అందరి స్పూర్తిగా నిలిచారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

బీహార్ రాష్ట్రం ఔరంగా బాద్ జిల్లా హస్ పురా గ్రామానికి చెందిన అనీస్ కేసరి..తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇక అనీస్ కేసరికి సేవా కార్యక్రమాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుండే వాడు. అలానే తన పెళ్లికి కూడా అందరిలాగా కాకుండా వెరైటీగా ఉండాలని భావించాడు. తన పెళ్లి వేడుక కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించాడు. ఇలాంటి తరుణంలో అనీస్ కేసరికి ఆరా ప్రాంతానికి చెందిన సిమ్రాన్ కేసరి అనే యువతితో నిశ్చితార్థం జరిగింది.

ఇటీవలే వీరిద్దరి వివాహ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో బంధువులు పెళ్లికి హాజరై.. సందడి చేశారు. ఇక పెళ్లి రోజు తాను అనుకున్నసేవ కార్యక్రమం చేయాలని అనీస్ అనుకున్నాడు. పెళ్లి మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు. ఇదే విషయాన్ని అనీస్.. సిమ్రాన్ కుటుంబాన్ని అడిగాడు. పెళ్లి వేడుకలో రక్తదానం వంటిది చేయడంపై వధువు కుటుంబం కాసేపు ఆలోచించింది. చివరకు వరుడు చెప్పిన మాటలకు వధువు కుటుంబ సభ్యులు కన్విన్స్ అయ్యే.. రక్తదాన శిబిరం ఏర్పాటు అంగీకరించారు. అనీస్ కోరినట్టే వారు వివాహం రోజున ఆ ఏర్పాట్లు చేశారు. వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన వారితో కలిపి 70 మంది రక్తదానం చేశారు.

పట్నాలోని నిరామయ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ రంజన్ వచ్చిన పెళ్లి వారింట రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.  తన జీవితంలో తొలిసారి ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని డాక్టర్ రాకేశ్ తెలిపారు. తాను రక్తదానం చేయడం 14వ సారి అని వరుడు అనీస్‌ తెలిపాడు. అనీష్ కి ఈ ప్రాంతంలో అత్యధికంగా రక్తదానులు రక్తవీర్ అనే పరు పొందాడు.  అలానే తనకు 9వసారి రక్తదానం చేశాని వధువు సిమ్రన్‌ చెప్పింది. ఇక రక్త దాన శిబిరం ఏర్పాటు చేసిన ఈ నూతన వధువరులను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. మరి.. తమ పెళ్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet