కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. శిథిలాల కింద 30 మంది..!

Bihar Bridge Collapses: కూలీ పనులు చేసుకుంటూ బతుకు బండిని నడిపే వారిపై కాలం కాటేసింది. ఎప్పటిలాగే పనులకు వెళ్లిన వారిపై మృత్యువు పగడ విప్పింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఘోర ప్రమాదం జరిగింది.

Bihar Bridge Collapses: కూలీ పనులు చేసుకుంటూ బతుకు బండిని నడిపే వారిపై కాలం కాటేసింది. ఎప్పటిలాగే పనులకు వెళ్లిన వారిపై మృత్యువు పగడ విప్పింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఘోర ప్రమాదం జరిగింది.

ఎంతో మంది పేదరికంలో మగ్గిపోతుంటారు. ఇక కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్తూ.. ఆ వచ్చిన డబ్బులతో జీవితాలను వెల్లదీస్తుంటారు. భవన, వంతెన, ప్రాజెక్ట్స్ వంచి వివిధ నిర్మాణ పనులకు పెద్ద సంఖ్యలో కూలీలు వెళ్తుంటారు. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో వారి బతుకులు చిధ్రమైపోతుంటాయి. గతంలో పలు నిర్మాణాలు కుప్పకూలి  కూలీ పనుల కోసం వచ్చిన వారు మరణించారు. తాజాగా నిర్మాణంలో ఉన్న  ఓ బ్రిడ్జీ కుప్పకూలి..దానికి కింద 30 మంది చిక్కుకున్నారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బీహార్‌ రాష్ట్రంలోని సుపాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్ పూర్, ఖగరియా జిల్లాలను కలుపుతూ ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. దాదాపు 1700 కోట్లతో ఈ నిర్మాణాన్ని  2014లో ప్రారంభించగా.. 2019లో పూర్తైంది. భాగల్ పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ నాలుగులైన్ల వంతెన శుక్రవారం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఈ 30మంది తీవ్రంగా గాయపడ్డారు.  సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాక శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. వంతెన కూలిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అలానే పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు గాయాలపాలైన పలువురిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు  అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు. సుపాల్‌ జిల్లాలోని మరీచా సమీపంలో కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జి శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని కొంత భాగం కూలిపోయింది. అయితే వంతెన కూలిపోయే ముందు కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కూలీలు ఈ వంతెన నిర్మాణంలో పాల్గొన్నారు. ఇలా అకస్మాత్తుగా వంతెన కూలీపై ఆ శిథిలాల కింద పడి 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికుల ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Show comments