iDreamPost
android-app
ios-app

VIDEO: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జి.. ముగ్గురు మృతి!

గుజరాత్ లో సోమవారం నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే సమయంలో దీని కింద ఉన్న ఆటో రిక్షా, ట్రాక్టర్ నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది.

గుజరాత్ లో ఘోరం చోటు చేసుకుంది. పలాన్ పూర్ లో సోమవారం అందరూ చూస్తుండగానే నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే సమయంలో దీని కింద ఉన్న ఆటో రిక్షా, ట్రాక్టర్ నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం.

అయితే ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి