iDreamPost
android-app
ios-app

సిద్ధి మూత్ర విసర్జన కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. సీఎం కాళ్లు కడిగింది ఎవరికి?

సిద్ధి మూత్ర విసర్జన కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. సీఎం కాళ్లు కడిగింది ఎవరికి?

మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకున్న మూత్ర విసర్జన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రవేశ్‌ శుక్లా అనే వ్యక్తి.. గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రంగంలోకి దిగారు. బాధితుడు దశవత్‌ రావత్‌ను సీఎం తన ఇంటికి పిలిపించుకున్నారు. స్వయంగా ఆయనే రావత్‌ కాళ్లు కడిగారు.  దీంతో ఈ సంఘటనపై ఆగ్రహంగా ఉన్న జనం కొంత శాంతించారు. ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురవటం మొదలైంది.

అయితే, ఈ కేసుకు సంబంధించి ఓ షాకింగ్‌ ట్విస్ట్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కాళ్లు కడిగిన దశవత్‌ రావత్‌ అసలు బాధితుడు కాదట.  ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పుకొచ్చాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘ ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని నేను కాదు. శుక్లా వాళ్ల బంధువు ఓ అఫిడవిట్‌ మీద దొంగ సంతకం పెట్టమని బలవంతం చేశాడు. నేను ఇ‍ప్పటి వరకు శుక్లాను చూసింది లేదు’’ అని పేర్కొన్నాడు. ఈ వీడియోను మధ్య ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అఫిషియల్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ముఖ్యమంత్రి కాళ్లు కడగడానికి.. సంఘటనతో సంబంధం లేని వ్యక్తిని తీసుకునివచ్చి డ్రామాలు ఆడారని కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోను వైరల్‌ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే అసలు వ్యక్తి ఎవరన్న దానిపై గందరగోళం నెలకొంది. మరో వైపు ఇంకో వీడియోలో దశవత్‌ మరో విధంగా మాట్లాడాడు.. ఇంటర్వ్యూ సందర్బంగా తాను తాగి ఉన్నానని, అందుకే ఆ వ్యక్తిని తాను కాదని చెప్పానని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. మరి, సిద్ధి మూత్ర విసర్జన కేసు బాధితుడి విషయంలో నెలకొన్న ఈ గందరగోళంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: వీడియో: మద్యం సేవించి కారు డ్రైవ్..  బైకును ఢీకొట్టడంతో..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి