Dharani
Lok Sabha Election 2024: ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీలు అలవికాని హామీలు ఇస్తుంటాయి. కానీ తాజాగా ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది. ఇంతకు ఏంటా హామీ అంటే..
Lok Sabha Election 2024: ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీలు అలవికాని హామీలు ఇస్తుంటాయి. కానీ తాజాగా ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది. ఇంతకు ఏంటా హామీ అంటే..
Dharani
మనదేశంలో ఎన్నికలంటే ధన ప్రవాహం అనే అభిప్రాయం సమాజంలో బలంగా పాతుకుపోయింది. ఎన్నికల వేళ మద్యం, ధనం ఏరులై పారుతుంది. వార్డు మెంబర్ గా గెలవాలన్న లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక ఎలక్షన్ సమయంలో పార్టీలు, అభ్యర్థులు అలవి కానీ హామీలు ఇస్తారు. ప్రజలను ఆకర్షించడం కోసం ముందు వెనకా చూసుకోకుండా భారీ ఎత్తున హామీలు ఇస్తుంటారు. ఇక తాజాగా ఓ పార్టీ అయితే మరో అడుగు ముందుకు వేసి.. తమను గెలిపిస్తే.. ఇంటికో కారు, బంగారు చైన్ గిఫ్ట్ గా ఇస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఈ ప్రకటన చేసిన పార్టీ ఏదంటే..
తమిళనాడులోని ఓ పార్టీ తమ అభ్యర్థిని గెలిపిస్తే ఖరీదైన కారు, బంగారు గొలుసులను బహుమతి ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న అక్కడ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈసారి ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్యే ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో గెలవాలని భావించి.. కాషాయ పార్టీ.. అక్కడ ఉన్న చిన్నాచితకా పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలుస్తోంది. తమిళనాడులో కీలకమైన తిరుచ్చి నియోజకవర్గంలో గట్టి పోటీ నడుస్తుంది. ఇక్కడ డీఎంకే మిత్రపక్షం ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి దురైవైగోపై అన్నాడీఎంకే నుంచి పుదుకోట్టైకు చెందిన కరుపయ్య అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు.
ఎలాగైనా సరే ఇక్కడ విజయం సాధించాలని అన్నాడీఎంకే బలంగా నిర్ణయించుకుంది. అందుకే తమ అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ నగర కార్యదర్శి, మండల కార్యదర్శికి కారు, బంగారు చెయిన్ బహుమతిగా ఇస్తామని మాజీమంత్రి విజయభాస్కర్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయభాస్కర్… కరుపయ్యను గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను గెలిపిస్తే ఇన్నోవా కారు, ఐదుసవర్ల బంగారు చెయిన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.