iDreamPost
android-app
ios-app

అమ్మని దేవుడు కన్నా గొప్ప అనేది ఇందుకు కథ! ఓ రియల్ స్టోరీ!

మనిషికి జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లు జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. అలానే ఓ వివాహిత కూడా తన కొత్త జీవితంపై ఎన్నో ఊహించుకుంది. అయితే తాజాగా ఆమె విషయంలో జరిగిన ఓ ఘటన అమ్మని దేవుడు కన్నా గొప్ప అనేది ఇందుకు కథ అని అనిపిస్తుంది.

మనిషికి జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లు జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. అలానే ఓ వివాహిత కూడా తన కొత్త జీవితంపై ఎన్నో ఊహించుకుంది. అయితే తాజాగా ఆమె విషయంలో జరిగిన ఓ ఘటన అమ్మని దేవుడు కన్నా గొప్ప అనేది ఇందుకు కథ అని అనిపిస్తుంది.

అమ్మని దేవుడు కన్నా గొప్ప అనేది ఇందుకు కథ! ఓ రియల్ స్టోరీ!

ప్రతి ఒక్కరికి జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు తమ జీవితంపై ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. అలానే కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు భర్త, పుట్టబోయే పిల్లలకు గురించి ఎన్నో ఆలోచిస్తుంటారు. ఇలానే అవివాహిత కూడా తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఊహించుకుంది. అనుకున్నట్లుగానే ఆమెకు బిడ్డ జన్మించింది. అయితే ఆ కుటుంబంలో సంతోషం బదులు విషాదం అలుముకుంది. మరి.. అసలు ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్నాటక రాష్ట్రంలోని కోలార్ తాలుకాలో జంగాలహళ్లి గ్రామానికి చెందిన భవాని(26) గర్భిణీ. ఆమెను అత్తింటి వాళ్లు, పుట్టింటి వాళ్లు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. తమ ఇంట కొత్త సభ్యులు రాబోతున్నారంటూ ఎన్నో ఆశలతో వారు ఊహించుకున్నారు. అలానే  రోజులు, నెలలు గడిచాయి. అనుకున్న సమయం రానే వచ్చింది. భవాని సోమవారం ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరింది. సాయంత్రం వైద్యులు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. మంగళవారం  ఉదయం బాలింతకు  కడుపు నొప్పి రాగా నర్సు ఇంజెక్షన్ ఇచ్చింది. తరువాత కొద్దిసేపటికి భవాని మృతి చెందింది. అలానే శిశువు తలపై కూడా గాయం కనిపించింది.

దీనిని బట్టి ఆపరేషన్ సక్రమంగా చేయలేదని మృతురాలి భర్త ఆరోపించారు. అంతేకాక ఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భవాని భర్త ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరాడు. శిశువు కళ్లు తెరవక ముందే తల్లిని కోల్పోయిందని మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఇంటికి వస్తారని ఎన్నో కలలు కంటే.. ఇలా జరిగిందనే భవాని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై సదరు ఆస్పత్రిక చెందిన  వైద్యాధికారి స్పందించారు. ఆస్పత్రిలో ఎవరూ నిర్లక్ష్యం చేయలేదని, వారంలో 45 ఆపరేషన్లు జరిగాయని, ఎక్కడా సమస్య కాలేదు.

మహిళ మృతిపై విచారణ చేస్తామని జిల్లా ఆస్పత్రి సర్జన్‌ డాక్టర్‌ విజయకుమార్‌ తెలిపారు. తప్పు ఎవరిదైనా, అక్కడ ఏమి జరిగిన ఓ నిండు ప్రాణం బలైపోగా.. ఓ పసిబిడ్డ తల్లిలేని అనాథగా మిలిగిలింది.ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి.  అనారోగ్య సమస్యలు, వైద్యుల నిరక్ష్యం.. ఇలా కారణాలు ఏమైనప్పటికీ  ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో పురిడి బిడ్డలు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.  మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.