Karnataka News: భార్య చేసిన పని జల సమాధి అయిన భర్త! ఏం జరిగిందంటే..

భార్య చేసిన పని జల సమాధి అయిన భర్త! ఏం జరిగిందంటే..

Karnataka News: ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు అనార్థాలకు దారితీస్తున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుని పెను ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఆమె భర్తకు మరణ శాసనమైంది.

Karnataka News: ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు అనార్థాలకు దారితీస్తున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుని పెను ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఆమె భర్తకు మరణ శాసనమైంది.

భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో తోడునీడగా కలిసి జీవించాలి. అలా ఎంతో మంది దంపతులు సంతోషంగా జీవిస్తుంటారు. కొందరు అయితే తమ భాగస్వామి ప్రమాదంలో ఉంటే.. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబ సభ్యుల పాలిట మృత్యు ద్వారాలుగా మారుతున్నాయి. తాజాగా ఓ వివాహిత చేసిన పని..ఆమె భర్తను జల సమాధి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్నాటక రాష్ట్రంలోని కలబురగి ప్రాంతంలోని అఫజల్ పూ ర్ తాలూకా, కడత గ్రామంలో లక్ష్మీ శివానంద(28), రాజు అనే దంపతులు నివాసం ఉంటున్నారు. స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే..వీరికి సమీపంలోని సొన్నా అనే గ్రామం దగ్గర్లో భీమా నది ఉంది. ఇటీవలే భారీగా వానాలు కురవడంతో.. ఆ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం లక్ష్మీ శివానంద్ దారుణ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఆమె ఆత్మహత్యయత్నం చేసింది.

సొన్నా గ్రామం సమీపంలో ఉన్న భీమా నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకుంది. లక్ష్మీ శివానంద్ ప్రవర్తనపై అనుమానంగా ఉన్న ఆమె భర్త, మరో బంధువులు ఆమెను అనుసరించారు. అయితే వారు లక్ష్మీని సమీపించే లోపే.. ఆమె వంతెనపై నుంచి నదిలోకి దూకేసింది. ఇక ఆమెను కాపాడేందుకు భర్త రాజు, మరో బంధువు కూడా నదిలోకి దూకారు. ఈ క్రమంలో అక్కడే చేపలు పడుతున్న వారు ఆమె మహిళలను రక్షిస్తారు. ఇదే సమయంలో ఆమె భర్తను, మరొక వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయగా విఫలం అవుతారు. లక్ష్మీని రక్షించేందుకు వెళ్లిన ఆమె భర్త, బంధువులు నీటిలో మునిగిపోయారు.

కుటుంబ కలహాలతో శివానంద భార్య లక్ష్మి భీమా నదిలో దూకినట్లు సమాచారం. సమాచారం అంద కున్న అగ్నిమాపక సిబ్బంది, అఫ్జల్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. రాత్రంతా ఆపరేషన్ నిర్వహించి రాజు మృతదేహాన్ని వెలికితీశారు. లక్ష్మి కలబురగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. మరో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తంగా ఆ మహిళ తీసుకున్న నిర్ణయం…రెండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇలా ఎంతో మంది క్షణికావేశంలో నిండు జీవితాన్ని బలి చేసుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు.

Show comments