iDreamPost
android-app
ios-app

విమానంలో అమ్మ. కొడుకు ఎంట్రీతో కళ్ళలో నీరు! రియల్ స్టొరీ!

  • Published Oct 13, 2023 | 10:22 AM Updated Updated Oct 13, 2023 | 10:22 AM
  • Published Oct 13, 2023 | 10:22 AMUpdated Oct 13, 2023 | 10:22 AM
విమానంలో అమ్మ. కొడుకు ఎంట్రీతో కళ్ళలో నీరు! రియల్ స్టొరీ!

ఇటీవల సోషల్ మీడియా వచ్చిప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. జీవితంలో మనం ఎన్నడూ చూడని వింతలు, విశేషాలకు చూసే అవకాశం కలుగుతుంది. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. మరికొన్ని బాధతో కన్నీరు పెట్టించే విధంగా, ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ తల్లీ కొడుకు కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొడుకును చూసి తల్లి ఆనందంతో ఉప్పొంగి పోతూ దగ్గరకి తీసుకొని కన్నీళ్లు పెడుతున్న దృశ్యం చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్య చదివి గొప్ప పొజీషన్లో ఉండాలని కోరుకుంటారు. అందుకోసం తాము ఎన్ని కష్టాలు పడైనా సరే పిల్లలకు మంచి విద్యాబుద్దులు నేర్పిస్తుంటారు. పిల్లల ఎదుగుదల చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు. ఇక ఆ ఎదుగుదల స్పష్టంగా వారి కళ్ల ముందే ఎదురైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఓ తల్లికి అలాంటి దృశ్యమే ఎదురైంది.. కొడుకు ఉన్నత స్థితి చూసి ఆ తల్లి ఎంతగానో మురిసిపోయింది. తాను ప్రయాణిస్తున్న విమానానికి పైలెలట్ తన కొడుకే అన్న విషయం తెలిసి ఆమె ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. ఎంతో గర్వంగా, సంతోషంగా ఉప్పొంగిపోయింది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది.

బెంగుళూరు కి చెందిన ఓ మహిళ ఫ్లైట్ ఎక్కింది. సాధారణంగా ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఎయిర్ హూస్టెస్ స్వాగతం పలుకుతుంటారు. కానీ అక్కడ సీన్ వేరుగా కనిపించింది. వీవీఐ పీకి స్వాగతం పలికినట్లుగా పైలెట్లు, ఎయిర్ హూస్టులు ఎదురొచ్చి మరీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. తన సీటు వైపు వెళ్తూ వెనక్కి తిరిగి చూడగా ఒక్కసారే ఆశ్చర్యపోయింది. ఆమెకు స్వాగతం చెప్పింది మరెవరో కాదు.. కన్న కొడుకే. ఆ మహిళ నడిపే విమానానికి పైలెట్ తన కొడుకే అని తెలియడంతో ఆ తల్లి పట్టరానికి ఆనందంతో ఉప్పొంగి పోయింది. ఇండిగో సంస్థలో పైలెట్ గా పనిచేస్తున్న తన కొడుకు ఇప్పుడు తాను ఎక్కిన విమానాన్ని నడపబోతున్నాడన్న విషయం తెలిసిందే సంతోషించింది. ‘ అమ్మా ఆయామ్ యువర్ డ్రైవర్’ అంటూ కొడుకు పలకరింపు విని ఆ తల్లి కళ్లు చెమ్మగిల్లాయి. వెల్ కమ్ ఆంటీ హ్యాపీనా అంటూ కొడుకు కొలిగ్స్ తల్లిని పలకరించడంతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నిజంగా ఏ తల్లైనా కొడుకు ఉన్నత స్థితిలో ఉంటే ఎంతగా గర్వపడుతుంది.. ఆనందంతో ఉప్పొగిపోతుందన్నదానికి ఇదే ఉదాహారణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibom