బెంగుళూరు రామేశ్వరం కేఫ్ యజమాని బాధ్యత గల ప్రకటన! హేట్సాఫ్

Great Decision by Rameswaram Cafe Owner: నిత్యం రద్దీతో ఉండే రామేశ్వరం కేఫ్‌లో పేలుగు ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.. వీరి విషయంలో కేఫ్ యజమాని మంచి మనసు చాటుకున్నారు.

Great Decision by Rameswaram Cafe Owner: నిత్యం రద్దీతో ఉండే రామేశ్వరం కేఫ్‌లో పేలుగు ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.. వీరి విషయంలో కేఫ్ యజమాని మంచి మనసు చాటుకున్నారు.

బెంగుళూరులో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిత్యం రామేశ్వరం కేఫ్ కి వందల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అంత రద్దీగా ఉన్న కేఫ్ లో పేలుడు ఘటన జరగడంతో ఎన్ఐఏ సీరియస్ గా తీసుకుంది. మొదట ఈ పేలుడు షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ, సిలిండర్ పేలుడు వల్ల కానీ జరిగి ఉండొచ్చని భావించారు. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిలిండర్ పేలుడు కాదని.. పక్కా ప్లాన్ తో పేలుడు జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందితో పాటు పలువురు కస్టమర్లకు గాయాలు అయ్యాయి. తాజాగా బాధితుల విషయంలో కేఫ్ యజమాని మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా సంచనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ ఘటనలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారం పేలుడుకి పాల్పపడ్డట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం రామేశ్వరం కేఫ్ యజమానురాలు దివ్య రాఘవేంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు జరిగిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అందులో ఓ వ్యక్తి టోపీ పెట్టుకొని మాస్క్, పఫ్లర్ ధరించి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచచి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాడని.. ఆ తర్వాత ఇడ్లీ తిన్న తర్వాత బయటకు వెళ్లే ముందు బ్యాగ్ ని ఓ మూలకు ఉంచాడని.. కొద్ది సేపటికే పేలుడు సంభవించిందని తెలిపింది. కేఫ్ పేలుడు ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంపై భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా రామేశ్వరం కేఫ్ యజమానురాలు దివ్య రాఘవేంద్ర రావు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

దివ్య రాఘవేంద్ర రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరగడం ఎంతో దురదృష్టం. ఈ ఘటనలో గాయపడ్డ వాళ్లు వెంటనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డవాళ్ల కుటుంబంతో మేం ఉన్నాం.. ఓ మహిళ చూపు కోల్పోయింది… ఆమెను అన్ని విధాలుగా చూసుకునే బాధ్యత మాదే. గాయపడ్డ వారిలో మా కేఫ్ సిబ్బంది ఉన్నారు.. వారి కుటుంబాలకు అండదండగా ఉంటాం. యువత శక్తి ఏంటో చూపిస్తాం.. మేం భారతీయులమని ఇలాంటి విధ్వంసాలకు భయపడేది లేదని చాటి చెబుతాం. మీ ఆశిస్సులు మాకు కావాలి. ఈ శుక్రవారం నుంచి మళ్లీ కేఫ్ ని మంచి సందడి వాతావరణంలో ప్రారంభిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్లీ ఎక్కడా పునావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ మాట్లాడారు.

హైదరాబాద్ లో 2007 ఆగస్టు, 25న తేదీన కోఠీలోని గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ లో ముష్కరులు బాంబు పేలుడుతో విధ్వంసం సృష్టించారు. ఈ నరమేధంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే గోకుల్ ఛాట్ పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. గోకుల్ ఛాట్ కి గతంలో మాదిరిగానే జనాలు వెళ్తున్నారు. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ ని సైతం వెంటనే ప్రారంభిస్తున్నారు. ఎక్కువ క్రౌడ్ ఉన్న హూటల్స్, మాల్స్, పార్కుల వద్ద మరింత నిఘా పెంచాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక రామేశ్వరం కేఫ్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments