iDreamPost
android-app
ios-app

5 ఏళ్ల ప్రేమ.. పెళ్లి ముందు రోజు ప్రియుడు పరార్..

  • Published Dec 12, 2023 | 12:04 PM Updated Updated Dec 12, 2023 | 12:04 PM

ఒకటి కాదూ రెండేళ్లు కాదు.. ఐదేళ్ల ప్రేమ వారిది. ప్రేమికులిద్దరూ తమ ఇష్ట ఇష్టాలు, అభిప్రాయాలు పంచుకున్నారు. తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించేందుకు.. తమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి రోజు ముందు వరుడు పరారయ్యాడు.. ఎందుకంటే..?

ఒకటి కాదూ రెండేళ్లు కాదు.. ఐదేళ్ల ప్రేమ వారిది. ప్రేమికులిద్దరూ తమ ఇష్ట ఇష్టాలు, అభిప్రాయాలు పంచుకున్నారు. తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించేందుకు.. తమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి రోజు ముందు వరుడు పరారయ్యాడు.. ఎందుకంటే..?

  • Published Dec 12, 2023 | 12:04 PMUpdated Dec 12, 2023 | 12:04 PM
5 ఏళ్ల ప్రేమ.. పెళ్లి ముందు రోజు ప్రియుడు పరార్..

ప్రేమికులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నారు. ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. బాసలు చేసుకున్నారు. తమ ప్రేమ పెళ్లికి చేరుతుందా అనుకున్నారు. ఎలాగైనా ఇంట్లో వాళ్లను ఒప్పించాలని ఐదేళ్ల పాటు వెయిట్ చేశారు. ఎట్టకేలకు వీరి పెద్దలు కూడా వివాహానికి అంగీకరించారు. ఇక వారి ఆనందానికి హద్దుల్లేవు. తమ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కుతుందని సంబరంలో మునిగి తేలిపోయింది ప్రేయసి. షాపింగ్ అయిపోయింది. ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి. రేపు పెళ్లి అనగా.. ఈ రోజు వరుడు పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ప్రయోజనం లేదని తెలిసి.. ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది.

ఈ ఘటన కర్ణాటకలోని చామనగర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కంటూరు గ్రామానికి చెందిన మహేష్, సంకన్ పురా కాలనీ వాసి దివ్యశ్రీ బెంగళూరులో ఒకే కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. గత 5 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే తమ విషయం పెద్దలు చెప్పి.. పెళ్లి చేసుకుందామని దివ్యశ్రీ కోరగా.. ప్రియుడు మహేష్ మూడు నెలలు సమయం కావాలని కోరాడు. అంత సమయం ఎందుకనుకున్న దివ్యశ్రీ.. తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే దివ్యశ్రీ తల్లిదండ్రులు ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించి పంచాయితీ పెట్టించారు.

ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ నెల 27 చిలకవాడి కొండలో పెళ్లి నిశ్చయించారు పంచాయతీ పెద్దలు. పెళ్లికి అవసరమైన వస్తువులు అన్నీ కొన్నారు. నవంబర్ 26న మహేష్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. ప్రియుడు జంప్ కావడంతో దివ్యశ్రీ మాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే అతడు జాడ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది ప్రియురాలు. సమాచారం అందుకున్న పోలీసులు మహేష్ ఇంటి వద్దకు చేరుకుని దివ్యశ్రీతో మాట్లాడారు. తర్వలోనే అతడి ఆచూకీ కనుక్కుంటామని నచ్చజెప్పి ఇంటికి పంపారు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రియుడు పరారయ్యాడంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఐదేళ్లు ప్రేమించుకుని, పెళ్లి అనగానే ప్రియుడు జంప్ ఎందుకయ్యాడనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcratosroyal girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet