iDreamPost
android-app
ios-app

ఆఫీస్ కి వచ్చి కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారా? ఇక మీ జాబ్స్ పోవడం పక్కా!

Amazon Coffee Badging: చాలా మంది ఆఫీస్ కి వెళ్లి.. కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కొంత సమయం మాత్రమే వర్క్ కోసం వినియోగిస్తుంటారు. ఇలాంటి పని చేసే వారికి జాబ్ రిస్క్ లో పడినట్లే. తాజాగా అమెజాన్ తీసుకున్న ఓ నిర్ణయమే అందుకు ఉదాహరణ.

Amazon Coffee Badging: చాలా మంది ఆఫీస్ కి వెళ్లి.. కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కొంత సమయం మాత్రమే వర్క్ కోసం వినియోగిస్తుంటారు. ఇలాంటి పని చేసే వారికి జాబ్ రిస్క్ లో పడినట్లే. తాజాగా అమెజాన్ తీసుకున్న ఓ నిర్ణయమే అందుకు ఉదాహరణ.

ఆఫీస్ కి వచ్చి కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారా? ఇక మీ జాబ్స్ పోవడం పక్కా!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్ లైన్ షాపింగ్ అందించే ఈ కామర్స్ సంస్థలో అమెజాన్ ఒకటి. తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఆఫీస్ కి రావాలని కోరిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రిటర్న్ టూ ఆఫీస్ విధానంలో ఉద్యోగులు ట్రిక్ ను ఉపయోగించారు. కాఫీ బ్యాడ్జింగ్ అనే ట్రిక్ తో  ఉద్యోగులు పని వేళల నిబంధన నుంచి తప్పించుకునేవారు. ఈ లోపాన్ని గుర్తించిన అమెజాన్ అలాంటి ఉద్యోగులపై చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే చాలా మం దికి కాఫీ బ్యాడ్జింగ్ అంటే ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రముఖ సంస్థలో అమెజాన్ ఒకటి. ఇక్కడ ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. కోవిడ్ టైమ్ లో  చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం చేశారు. గత ఏడాది ప్రారంభంలో అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది. అయితే ఆమెజాన్ తీసుకొచ్చిన ఈ నిబంధనపై ఉద్యోగుల నుండి ప్రతిఘటన ఎదురైంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వినతులు ఇచ్చారు. అయినా, అమెజాన్ వారి డిమాండ్ లను పట్టించుకోలేదు. ఆఫీస్ కు రావాల్సిందేనని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. అలా రాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

ఇది ఇలా ఉంటే.. అమెజాన్ లో ఉద్యోగులు ఆఫీస్ లో వర్క్ చేసే కనీస సమయం అంటూ నిబంధన లేదు. ఈ లూప్ ను గుర్తించిన కొందరు ఉద్యోగులు కొత్త ట్రిక్ కి తెరతీశారు. ఆఫీస్ కు వచ్చిన కొందరు ఉద్యోగులు కాసేపు తమ సీట్లో గడిపి.. ఆ తరువాత ఒక కాఫీ తాగి..అక్కడే టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అనంతరం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిపోయేవారు. దీన్నే ‘కాఫీ బ్యాడ్జింగ్’ అనడం ప్రారంభించారు. ఉద్యోగులు ఆఫీస్ లో ఉండాల్సిన కనీస గంటల నిబంధన లేకపోవడంతో అమెజాన్ లో కాఫీ బ్యాడ్జింగ్ అనే ట్రిక్ సాధ్యమైంది.

ఇక ఉద్యోగుల వినియోగిస్తున్న ఈ ట్రిక్ ను అమెజాన్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. వెంటనే, ఆఫీస్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కాఫీ బ్యాడ్జింగ్ కు తరచుగా పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు దిగింది. ముఖ్యంగా రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టీమ్ లో పని చేసే ఉద్యోగులు ఆఫీస్ లోకనీసం 2 గంటలు గడపాలని నిబంధన పెట్టింది. అలానే మరికొన్ని ఇతర ప్రాజెక్ట్ ల్లో పని చేసే ఉద్యోగులు కనీసం 6 గంటలు ఆఫీస్ లో ఉండాలంటూ నిబంధనలు మార్పులు చేసింది. ఇలా చాలా సంస్థల్లో కూడా కొందరు ఉద్యోగులు కాఫీలు తాగుతూ.. టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెజాన్ మాదిరిగానే ఇతర సంస్థలు కూడా చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. మొత్తంగా ఎవరైనా ఇలా ఆఫీస్ వెేళ కాఫీలు తాగుతూ టైమ్ వృథా చేస్తున్నట్లు అయితే..వారి జాబ్ రిస్క్ లో పడినట్లే  అని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి