iDreamPost
android-app
ios-app

ఏలియన్స్‌కు గుడి కట్టి పూజలు! ఆ కష్టం నుండి కాపాడమని!

  • Published Aug 03, 2024 | 2:25 PM Updated Updated Aug 03, 2024 | 2:25 PM

భూగ్రహంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఏలియన్స్ ఉన్నారన్నది కొంత మంది వాదన. ఇది ఇంకా సైంటిఫికల్ గా రుజువు కాలేదు. కానీ ఓ వ్యక్తి ఏకంగా గ్రహాంతర వాసుల కోసం గుడి కట్టించాడు. ఎందుకంటే..?

భూగ్రహంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఏలియన్స్ ఉన్నారన్నది కొంత మంది వాదన. ఇది ఇంకా సైంటిఫికల్ గా రుజువు కాలేదు. కానీ ఓ వ్యక్తి ఏకంగా గ్రహాంతర వాసుల కోసం గుడి కట్టించాడు. ఎందుకంటే..?

  • Published Aug 03, 2024 | 2:25 PMUpdated Aug 03, 2024 | 2:25 PM
ఏలియన్స్‌కు గుడి కట్టి పూజలు! ఆ కష్టం నుండి కాపాడమని!

సాధారణంగా దేవతలకు, దేవుళ్లకు దేవాలయాలు నిర్మించి పూజించుకుంటూ ఉంటాం. అలాగే విగ్రహాల ప్రతిష్టాపన చేసి స్మరించుకుంటాం. కోర్కెలు తీర్చాలంటూ విన్నవించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో తమను విడిచి వెళ్లిపోయిన వ్యక్తుల కోసం కూడా గుడి నిర్మించడాన్ని చూస్తున్నాం. మరణించిన భార్య కోసం భర్త, తనను ప్రాణంగా చూసుకున్న భర్త ఇక లేడని జీర్ణించుకోలేకపోయిన భార్య.. భర్తను స్మరించుకునేందుకు గుడి నిర్మిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్నాయి. అంతేనా అభిమాన నటీనటులకు కూడా గుడులు కట్టి పూజించుకుంటున్నారు ఫ్యాన్స్. కుష్బు, హన్సిక, సమంతలాంటి స్టార్ హీరోయిన్లకు గుడి కట్టిన దాఖలాలున్నాయి. అయితే మనిషి, దేవుడికి కాకుండా ఓ వింత జీవికి గుడి కట్టి పూజిస్తున్నాడు ఓ వ్యక్తి.

గ్రహంతర వాసుల కోసం గుడి కట్టి పూజిస్తున్నాడో వ్యక్తి. ఇప్పటి వరకు ఊహాతీతంగా అలాగే సైంటిఫికల్‌గా నిరూపితం కానీ ఏలియన్స్ కోసం దేవాలయాన్ని నిర్మించడమే కాకుండా పూజలు చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ గుడి తమిళనాడులోని సేలంలో ఉంది. మల్లముపంబట్టికి చెందిన లోగనాథన్.. ఏలియన్స్ కోసం తన వ్యవసాయ భూమిలో గుడిని ఏర్పాటు చేయడంతో పాటు ఏకంగా గ్రహంతర దేవుడ్ని ప్రతిష్టాపించాడు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావనంలా వ్యాపించింది. గ్రహాంతర దేవుడితో పాటు.. సెల్లార్‌లో శివుడు, పార్వతి, మురుగన్, కాళి వంటి దేవతల విగ్రహాలను కూడా ప్రతిష్టాపించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ గుడిని నిర్మించడానికి అతడు అనుమతులు కూడా తీసుకోవడం గమనార్హం.

ఇంతకు అతడు ఆ గుడి నిర్మించడానికి కారణాలేంటో తెలుసా..? ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతర వాసులకు ఉందని నమ్ముతున్న లోగనాథన్ ఏలియన్ గుడిని నిర్మించాడు. ప్రజలను కాపాడే శక్తి గ్రహాంతర దేవుడికి ఉందని అంటున్న అతడు.. ఈ విగ్రహం ఏలియన్స్‌తో మాట్లాడుతుందని చెబుతున్నాడు. గ్రహాంతర వాసులకు ఈ దేవుడు సమాచారాన్ని చేరవేస్తున్నాడని అంటున్నాడు. అలాగే గ్రహాంతర వాసుల నుండి వచ్చే రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి అరిటాకు శరీరానికి చుట్టుకోవాలంటూ అశ్రాస్తీయమైన వాదనలు చేస్తున్నాడు. ఇంకా అక్కడ ఈ గుడి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  ఈ గుడి గురించి స్థానికంగా చర్చనీయాంశం కావడంతో పెద్ద సంఖ్యలో తిలకించేందుకు వస్తుండటం విశేషం. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నాయన్న బలమైన వాదన లేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్న సంగతి విదితమే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom