iDreamPost
android-app
ios-app

వీడియో: బైకుపై ప్రియుడితో ప్రియురాలు.. షాకిచ్చిన పోలీసులు

  • Published May 12, 2024 | 6:22 PM Updated Updated May 12, 2024 | 6:22 PM

ప్రేమలో ఉన్న వారు బైక్ పై చేసే విన్యాసాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఏకంగా బైక్ పై ప్రమాదకర స్థితిలో రైడ్ చేస్తూ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. ఇలాగే ఓ ప్రేమ జంట రొమాంటిక్ స్టంట్స్ చేస్తూ ఎస్పీకి దొరికిపోయింది.

ప్రేమలో ఉన్న వారు బైక్ పై చేసే విన్యాసాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఏకంగా బైక్ పై ప్రమాదకర స్థితిలో రైడ్ చేస్తూ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. ఇలాగే ఓ ప్రేమ జంట రొమాంటిక్ స్టంట్స్ చేస్తూ ఎస్పీకి దొరికిపోయింది.

  • Published May 12, 2024 | 6:22 PMUpdated May 12, 2024 | 6:22 PM
వీడియో: బైకుపై ప్రియుడితో ప్రియురాలు.. షాకిచ్చిన పోలీసులు

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో హల్ చల్ చేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం పిచ్చిపట్టిన వాళ్లలాగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో, నడి రోడ్లపై డ్యాన్సులు చేస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా ప్రేమజంటలకు పైత్యం మరింత ముదిరింది. జనాలు చూస్తున్నారనే సోయి లేకుండా అసభ్యకర రీతిలో వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట బైక్ పై రొమాంటిక్ స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇది గమనించిన అక్కడి ఎస్ పీ వారికి బిగ్ షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ప్రేమే లోకంగా బ్రతికే వారు లోకంతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చింది చేస్తూ జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఓ ప్రేమ జంట రోడ్డుపై బైక్ పై వెళ్తూ హల్ చల్ చేసింది. అయితే అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న జిల్లా ఎస్పీ ఈ ప్రేమ జంటను గమనించి తన ఫోన్ లో వీడియో తీశాడు. ఆ తర్వాత వారికి చలానా విధించాడు. బైకులపై ఇలాంటి స్టంట్స్‌ వేయవద్దని వారిని హెచ్చరించి పంపించాడు. జాష్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వినయ్‌ అనే యువకుడు బైకు నడుపుతుండగా అతని ప్రేయసి సుహానా అనే యువతి పెట్రోల్‌ ట్యాంకుపై అతనికి ఎదురుగా కూర్చుంది. సినిమా లెవల్లో రోడ్డుమీద రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారు ఈ ప్రేమ పక్షులు. ఇదే సమయంలో జాష్‌పూర్‌ జిల్లా ఎస్పీ శశిమోహన్‌ సింగ్‌ ఇదే దారిలో వెళ్తున్నారు. ప్రేమ జంట చేస్తున్న రొమాంటిక్ స్టంట్స్ ఆయన కంట పడింది. తన మొబైల్ ఫోన్ తో ఈ తతాంగాన్ని వీడియో తీశాడు. ప్రమాదకర రీతిలో ఇలాంటి స్కంట్ చేయొద్దని చెప్పి వారికి చలానా విధించాడు. వాహనదారులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించొద్దని సూచించి పంపిచాడు. మరి ప్రేమజంట చేసిన రొమాంటిక్ స్టంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş