ఈ అమ్మాయిది హీరోయిన్ రేంజ్! అనుకోకుండా ఓ చిన్న తప్పు చేసి!

Influencer Aanvi Kamdar: ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్, వీడియలు చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Influencer Aanvi Kamdar: ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్, వీడియలు చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎప్పటికప్పుడు వెరైటీ వీడియోలు, రీల్స్ చేస్తూ లైకులు, షేర్లు, కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రీల్స్ పిచ్చి చిన్న పెద్దా అనే తేడా లేకుండా పోయింది. డ్యాన్సులు, పాటలు పాడటం, డైలాగ్స్, వెరైటీ వంటలు, కామెడీ స్కిట్స్ ఇలా రక రకాల రీల్స్, వీడియోలు చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పాపులారటీ సంపాదించాలనుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొంతమంది సాహస కృత్యాలకు సంబంధించిన వీడియోలు చేడం, దేశ విదేశాల్లో టూర్లు చేస్తూ అక్కడి అందాలు చిత్రీకరించి వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొన్ని వీడియోలు బాగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్లు అయిన వాళ్లు ఉన్నారు. రీల్స్ చేస్తూ.. ఓ ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ లోయలో పడిపోయింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల మహరాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు చిత్తడిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఓ ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన రాయ్‌గఢ్ లొని కుంభే జలపాతంలో చోటు చేసుకుంది. మహరాష్ట్రకు చెందిన ఆన్వీ కామ్‌దార్ (26) ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ టూర్లు తిరుగుతూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా పేరు తెచ్చుకుంది. జులై 16న ఆన్వీ కామ్‌దార్ తన స్నేహితులతో కలిసి కుంభే జలపాతం వద్దకు వెళ్లింది. రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్ ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆన్వీ మృతదేహాన్ని బయటకు తీశారు.

ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూసింది. విహారయాత్ర విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి.. ఇలాంటి జలపాతాల వద్ద చిత్తడి ఎక్కువగా ఉంటుంది. అందుకే జలపాతాల వద్దకు యాత్రకు వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు, రీల్స్ చేయడం అంత మంచిది కాదని అంటున్నారు. తక్కువ వయసులో ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మంచి పేరు తెచ్చుకున్న ఆన్వీ కామ్‌దార్ ప్రమాదవశాత్తు చనిపోయిన విషయం తెలుసుకొని ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

Show comments