iDreamPost
android-app
ios-app

విషాదం: గాయకుడి ప్రాణాలు తీసిన గుర్రం!

  • Published Sep 25, 2023 | 4:03 PM Updated Updated Sep 25, 2023 | 4:03 PM
  • Published Sep 25, 2023 | 4:03 PMUpdated Sep 25, 2023 | 4:03 PM
విషాదం: గాయకుడి ప్రాణాలు తీసిన గుర్రం!

మనిషి జీవితం చాలా స్వల్పమైనది. మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకే తెలీదు. మృత్యువు ఎప్పుడు? ఎలా? పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేము. వయో భారంతో చనిపోవటం పక్కన పెడితే.. వయసులో ఉండగానే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవటం అంత దారుణం ఇంకోటి ఉండదు. తాజాగా, ఓ ‍సింగర్‌ గుర్రం కారణంగా మృత్యువాత పడ్డాడు. బైకు మీద వెళుతున్న అతడ్ని గుర్రం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి ‍ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు, దేవదుర్గ తాలూకా, బాగూరుకు చెందిన ఆస్టిన్‌ రాజుకు సింగర్‌, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా స్థానికంగా మంచి పేరుంది. తరచుగా ఆర్కిస్ట్రాతో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. నిన్న రాత్రి ఓ కార్యక్రమంలో పాటలు పాడ్డానికి వెళ్లాడు. బాగా పొద్దుపోయిన తర్వాత బైకుపై ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో జాళహళ్లి గ్రామం దగ్గర విషాదం చోటుచేసుకుంది. గుర్రం రూపంలో మృత్యువు దూసుకు వచ్చింది.

ఆస్టిన్‌ రాజు వెళుతున్న బైకు ఓ గుర్రాన్ని ఢీకొట్టింది. దీంతో బైకుపై నుంచి కిందపడ్డాడు. ఆ పడ్డం పడ్డం తల బలంగా నేలకు తాకటంతో తీవ్ర గాయమైంది. గాయం కారణంగా ఆస్టిన్‌ రాజు అక్కడికక్కడే మృత్యు వాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యాక్సిడెంట్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి, గుర్రం కారణంగా సింగర్‌ రాజు ప్రాణాలు కోల్పోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom