iDreamPost
android-app
ios-app

అంబానీనా మాజాకా.. ఇద్దరు సింగర్లకే రూ.141 కోట్లు ఖర్చు?

  • Published Jul 09, 2024 | 5:17 PM Updated Updated Jul 09, 2024 | 5:17 PM

Anant-Radhika wedding: రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలిసింది. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు. ఆయన ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఇదే సమయంలో వెడ్డింగ్ కోసం చేసే ఖర్చుకు సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

Anant-Radhika wedding: రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలిసింది. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు. ఆయన ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఇదే సమయంలో వెడ్డింగ్ కోసం చేసే ఖర్చుకు సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది.

  • Published Jul 09, 2024 | 5:17 PMUpdated Jul 09, 2024 | 5:17 PM
అంబానీనా మాజాకా.. ఇద్దరు సింగర్లకే రూ.141 కోట్లు ఖర్చు?

సాధారణంగా పెళ్లి అంటే వారం రోజుల ముందు నుంచి తెగ సందడి ఉంటుంది. అసలైన వేడుక మాత్రం మూడు రోజుల ముందే ఉంటుంది. ఇది సామాన్యుల ఇళ్లలో జరిగే పెళ్లి విధానం. కానీ ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట మాత్రం పెళ్లి వేడుక ఐదు నెలల ముందు నుంచి హంగామా ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని ముకేశ్ అంబానీ నిర్వహిస్తున్నాడు. ఇందుకో కోసం కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలకు,తాజాగా పెళ్లి వేడుకలకు ముకేష్ అంబానీ బాగానే ఖర్చు చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఓ వార్త మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ఇద్దరు సింగర్లకు రూ.141 కోట్లు ఖర్చు చేసినట్లుటాక్ వినిపిస్తోంది. మరి.. ప్రముఖ సింగర్స్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలిసింది. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు. మాములు కోటిీశ్వర్ల ఇళ్లలోనే పెళ్లిళ్లు ఎంతో గ్రాండ్ గా జరుగుతాయి. అలాంటిది ఇక కుబేరుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉంటాది. ఆకాశమంత పందిరితో అంగరంగవైభవంగా సాగుతోంది. గతంలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు జామా నగరంలో జరిగిన సంగతి తె లిసింది. ఇక జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.

ఈ  పెళ్లికి సంబంధించిన వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక ఈ వివాహనికి దేశ విదేశాల్లోని ప్రముఖలందరికి ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించింది. వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ..పెళ్లివేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ముంబైలో ప్రముఖ పాప్ స్టార్ జస్టిస్ బిబర్ సంగీత కార్యక్రమంతో న అనంత్, రాధికల వివాహ వేడుక ప్రారంభమైంది. జులై 12న వీరి వివాహం జరుగనుంది. జులై 13న శుభ ఆశీర్వాద్, జులై 14న వివాహ రిసెప్షన్ కార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ వేడుకలు ముగియనున్నాయి. బీబర్ శుక్రవారం నాడు తన గాత్రంతో అతిథులందరినీ ఆకట్టుకున్నాడు.  ఆయనతో పాటు అడెల్, డ్రేక్,లానా, డెల్ రే వంటి సింగర్స్ సైతం పెళ్లిలో పాటలు పాడారు.

ఇక ఈ పెళ్లి వేడుకలో ఇద్దరు సింగర్లకు భారీగా డబ్బులు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కు రూ.83 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అలానే గతంలో జామా నగర్ లో జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకలో లేడీ సింగర్ రిహన్నాకు రూ.58 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ రెండు కనుక నిజమే అయితే.. కేవలం ఆ ఇద్దరు సింగర్లకే  రూ.141 కోట్లు ఖర్చు చేశారు. వీరితో పాటు మరికొందరు పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తంగా అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుక, ఖర్చులను చూసి..కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş