‘దానా’ తుఫాన్ టెన్షన్.. నాలుగు రోజులు స్కూళ్లకు సెలవులు!

Dana Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ లో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో దానా తుఫాన్ ఎఫెక్ట్ బీభత్సంగా చూపిస్తుంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమ్యాయి. విద్యా సంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

Dana Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ లో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో దానా తుఫాన్ ఎఫెక్ట్ బీభత్సంగా చూపిస్తుంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమ్యాయి. విద్యా సంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్ర రూపం దాల్చింది.ఇది అల్పపీడనంగా మారి క్రమంగా వాయుగుండంగా ఏర్పడింది. ప్రస్తుతం దానా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అంతేకాదు దానా తుఫాన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. బుధవారం 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. 25వ వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దానా తుఫాన్ గురువారం 24వ తేదీ నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. దానా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో భారీగా వర్షాలు పడుతున్నాయి. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా ఒడిశా మీదుగా వెళ్లే 198 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఒడిశా ప్రభుత్వం 14 జిల్లాల్లోని 3 వేల గ్రామాల నుంచి పది లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిభిరాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దానా తుఫాన్ ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.ఇప్పటికే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దానా తుఫాన్ ఎఫెక్ట్ ఒడిశాలోని పూరి నుంచి తూర్పు తీరం మొత్తం, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం తీరం మొత్తం ఉంటుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు గురువారం 24వ తేదీన సికింద్రాబాద్- భువనేశ్వర్, హైద్రాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – మల్దాటౌన్ రైళ్లు రద్దు చేశారు. అలాగే శుక్రవారం 25వ తేదీన హౌరా – సికింద్రాబాద్, షాలిమార్ – హైదరాబాద్, సిల్చార్ – సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు. వీటి ప్రభావం రాయలసీమలో పలు జిల్లాల్లో ఉంటుందని.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏపీలో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగినట్లు అధికారుల తెలిపారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్ల కూడదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 

Show comments