iDreamPost
android-app
ios-app

కారు, బైక్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్! ఈ విషయంలో అధికారులు చాలా సీరియస్!

RTO New Decision: ఈ మధ్య కాలంలో చాలా మంది తమ వాణనాలపై నెంబర్ ప్లేట్స్ రక రకాల డిజైన్లు, ఫాంట్స్ వాడుతున్నారు. ఇటాంటి నంబర్ ప్లేట్లు చట్టరీత్య విరుద్ధం.. భారీగా జరిమానా కూడా విధిస్తారు.

RTO New Decision: ఈ మధ్య కాలంలో చాలా మంది తమ వాణనాలపై నెంబర్ ప్లేట్స్ రక రకాల డిజైన్లు, ఫాంట్స్ వాడుతున్నారు. ఇటాంటి నంబర్ ప్లేట్లు చట్టరీత్య విరుద్ధం.. భారీగా జరిమానా కూడా విధిస్తారు.

కారు, బైక్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్!  ఈ విషయంలో అధికారులు చాలా సీరియస్!

ఈ మధ్య కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిఅవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కొంతమంది వాహనదారులు తమ నెంబర్ ప్లేట్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రక రకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవం చూస్తున్నాం.ఇటా చేయడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే పోలీసులు నెంబర్ ప్లేట్ పై అక్షరాలు గుర్తించడం కష్టతరంగా మారుతుంది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు పై వాహనాలు నడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వీటన్నింటికి చెక్ పెడుతూ ఆర్‌టీఓ కీలక నిర్ణయం తీసుకుంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP)తప్పని సరి చేసింది. వివరాల్లోకి వెళితే..

కారు, బైక్ ఇతర వాహనదారులకు బీ అలర్ట్. ట్రాఫిక్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్ల గప్పి వాహనాలు నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. జరిమానాలు విధిస్తున్నా కొంతమందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు అంటున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేశారు. కొంతమంది వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు.. అలా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రూ.10 వేల జరిమానా విధించనున్నారు. అంతేకాదు వాహనం కూడా సీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలను పెట్రోల్ పంప్ ల వద్ద ఆపి జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీస్ ఇచ్చిది. అలాగే సర్టిఫికెట్ సకాలంలో రెన్యూవల్ చేయించని వారికి రూ.10 వేల

లాగే, కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోలు పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీసు ఇచ్చింది. PUC) అదే విధంగా, సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించబడకపోతే, రూ 10,000 జరిమానా విధించబడుతుంది. ఇక వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) తప్పని సరి చేసింది రవవాణా శాఖ. 31 డిసెంబర్ 2022 వరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏప్రిల్ 1, 2019 కంటే ముందు రిజిస్టర్ చేసిన అన్ని ద్విచక్ర వాహనాలు, కార్లకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి అని అదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. మీ వాహనాలపై హెచ్ఎస్ఆర్‌పీ లేనట్లేయితే.. వెంటనే ఇన్ స్టాల్ చేసుకోండి.

మోటారు వాహన చట్ట ప్రకారం, వాహనాలు తప్పని సరిగా హెచ్ఎస్ఆర్‌పీ, కలర్ కోడెడ్ స్టిక్కర్ లను కలిగి ఉండాలని చెబుతుంది. జూన్ 1 తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమలుపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచుతారు..  మే 31 వరకు నెంబర్ ప్లేట్ తీసుకోవాలని ఆర్టీఓ చెబుతుంది. హెచ్‌ఎస్‌ఆర్‌పీ పెట్రోల్ బంక్ లోనూ తనిఖీ చేసే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 2019 లోపు వాహనదారులు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్ ను పొందాలని కారు, ఆటో, బైక్ నడిపే డ్రైవర్ల భద్రత కోసం ఈ నిబంధనలు అమలు చేసినట్లు ఆర్టీఓ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చిన్న వాహనాలకు రూ.2 వేలు, పెద్ద వాహనాలకు రూ.5 వేల జరిమానా విధిస్తారని తెలిపింది.

హెచ్ఎస్ఆర్‌పీ నెంబర్ ప్లేట్ ని అల్యూమినియంతో తయారు చేస్తారు. ఒక్కసారి ఉపయోగించిన స్నాప్ – ఆన్ లాక్ ద్వారా వాహనం ముందు, వెనుక భాగంలో ఇన్ స్టాల్ చేస్తారు. ఇందులో ‘INDIA’ అని 45 డిగ్రీల కోణంలో రాయబడి ఉంటుంది. ఈ ప్లేట్ లో సంఖ్యలు, అక్షరాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిపై లైట్ పడితే సంఖ్యలు, అక్షరాలు మెరిసిపోతాయి. దీంతో సీసీటీవీ కెమెరాల్లో సులువుగా కనుగొనే ఛాన్స్ ఉంటుంది. ప్లేట్ ఎగువ ఎడమ మూలలో నీలం రంగు లో ఉన్న అశోక చక్రం హాట్ స్టాంప్డ్ క్రోమియం ఆధారిత హూల్ గ్రామ్ ఉంటుంది. అలాగే దీని కింద 10 అంకెల రహస్య కోడ్ పిన్ ఎడమ మూల లో లేజర్ తో రాసి ఉంటుంది. ఈ రహస్య కోడ్ లో వాణానికి సంబంధించిన ఛాసిస్, ఇంజన్ నెంబర్, కొనుగోలు తేది, వాహనం మోడల్, డీలర్, రిజిస్ట్రేషన్ అథారిటీ అన్న వివరాలు ఉంటాయి. కారులో రెండు కోడ్ లు రంగు పూతతో కూడిన స్టిక్కర్ పై కూడా రాసి ఉంటుంది. హెచ్ఎస్ఆర్‌పీ నెంబర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి