Arjun Suravaram
IIT Bombay Students: ఐఐటీ బాంబే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోనే టాప్ విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కొందరి విద్యార్థులకు ఏకంగా రూ.1.2లక్షల జరిమాన పడింది.
IIT Bombay Students: ఐఐటీ బాంబే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోనే టాప్ విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కొందరి విద్యార్థులకు ఏకంగా రూ.1.2లక్షల జరిమాన పడింది.
Arjun Suravaram
మనం చేసే పని మనకు మాత్రమే నచ్చితే సరిపోదు.. సమాజం కూడా అంగీకరించే లాగా ఉండాలి. అంతేకా ఏదో చేయాలని చూస్తే..మాత్రం భారీ మూల్యం తప్పదు. ఈ కండీషన్ అనేది.. కేవలం సమాజంలోని ప్రజలకే కాక..విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. తాజాగా కొందరు విద్యార్థులు చేసిన నాటకం వారికి భారీ షాక్ ఇచ్చింది. ఐఐటీ బాంబే విద్యార్థులకు ఒక్కొక్కరి రూ.1.2 లక్షల జరిమానా పడింది. వారు ప్రదర్శించిన అత్యుహ్సామే ఈ భారీ జరిమానాకు కారణం అని తెలుస్తోంది. ఇక అసలు స్టోరి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే లో మార్చి 31న పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు కల్చరల్ యాక్టీవిటీస్ ను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్ధులు రాహోవన్ అనే నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణానికి అనుకరణగా భావించే ఈ ‘రాహోవన్’ అనే నాటకం వివాదస్పదంగా మారింది. ఈ విద్యార్థులు ప్రదర్శించిన రాహోవన్ నాటకం.. రామాయణాన్ని హిందు దేవుళ్లను కించరిచేలా ఉందని ఆరోపిస్తూ మరికొందరు విద్యార్థులు కాలేజీ యాజమాన్యంకి ఫిర్యాదు చేశారు. ఈ నాటకంలో స్త్రీవాదాన్ని ప్రోత్సహించడం అనే ముసుగులో సాంస్కృతిక విలువలను అపహాస్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో మే 8న క్రమశిక్షణా కమిటీ సమావేశానికి నిర్వహించది. జూన్ 4న నాటకం ప్రదర్శించిన ఎనిమిది మంది విద్యార్థులకు జరిమానా విధిస్తూ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది. మొత్తం నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1.2 లక్షలు, మరో నలుగురు విద్యార్థులకు రూ.40 వేలు జరిమానా విధించారు. గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు అదనపు శిక్షలు కూడా విధిచాంరు. విద్యార్థులకు ఇచ్చే జింఖానా అవార్డుల నిలిపివేసింది. హాస్టల్ సౌకర్యాల నుండి జూనియర్ విద్యార్థులను డిబార్ చేశారు. ఈ జరిమానాలు జూలై 20లోపు చెల్లించాలని యూనివర్సిటీ డిన్ కార్యాలయం పేర్కొంది. ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..తదుపరి ఆంక్షలు తప్పని ఇన్ స్టిట్యూట్ హెచ్చరించింది.
రాముడిని, రామాయణాన్ని అపహాస్యం చేస్తూ ఐఐటీ బాంబే లోని కొందరు విద్యార్థులు చేసిన నాటకం సోషల్ మీడాయాలో కూడా వైరల్ అయ్యింది. గొప్ప వ్యక్తులను ఎగతాళి చేస్తూ విద్యార్థులు విద్యా స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని మరికొందరు విద్యార్థులు ఆరోపించారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో విద్యార్థులు రామాయణ పాత్రలు, ప్లాట్ సెట్టింగ్‌ల నుండి ప్రేరణ పొందిన నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక వీడియోలో సీతను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ ను, ఆమెను తీసుకెళ్లిన ప్రదేశాన్ని ప్రశంసించడం కనిపిస్తుంది. దీంతో ఇది కాస్తా వివాదం మారింది. ఇది చాలా దారుణం. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ అనేది IIT బొంబాయిలో వార్షిక సాంస్కృతిక కార్యక్రమం. ఇది వివిధ కళారూపాలలో విద్యార్థుల తమ ప్రతిభను ప్రదర్శించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ సారి కొందరి విద్యార్థుల నాటకం వారికి..భారీ జరిమాన పడేందుకు కారణమైంది.