iDreamPost
android-app
ios-app

రక్షా బంధన్‌ రోజు ఇదేం పిచ్చి.. వైరల్‌గా బాండ్‌ పేపర్‌!

  • Published Aug 31, 2023 | 12:41 PM Updated Updated Aug 31, 2023 | 12:41 PM
  • Published Aug 31, 2023 | 12:41 PMUpdated Aug 31, 2023 | 12:41 PM
రక్షా బంధన్‌ రోజు ఇదేం పిచ్చి.. వైరల్‌గా  బాండ్‌ పేపర్‌!

దేశంలోని అక్కాచెల్లెళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్న రాఖీ పండగ రానే వచ్చింది. ఆడవాళ్లు తమ ప్రియమైన సోదరులకు రాఖీ కట్టడానికి దూర ప్రయాణాలకు కూడా వెనకాడ్డం లేదు. చిన్న పిల్లలే కాదు.. ముసలి వాళ్లు కూడా తమ అన్నలకు, తమ్ములకు రాఖీ కట్టి సంతోషపడుతున్నారు. రాఖీ కట్టే శుభ గడియలు బుధవారం రాత్రి నుంచి మొదలవ్వగా.. గురువారం కూడా కొనసాగనున్నాయి. రాఖీలు కట్టించుకోవటం.. కట్టడం ఓ ఎత్తయితే..

వాటిని తమ సోషల్‌ మీడియాల్లో పోస్టు చేయటం మరో ఎత్తు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా రక్షా బంధన్‌ హవా కనిపిస్తోంది. రక్షా బంధన్‌కు సంబంధించి వింత వింత విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రక్షా బంధన్‌ రోజు ఓ అన్న తన చెల్లెలి కోసం తయారు చేసిన బాండ్‌ పేపర్‌ వైరల్‌గా మారింది. ఆ బాంబ్‌ పేపర్‌లో ఈ విధంగా ఉంది…

  • మ్యాగీ ఎవరు చేసినా.. అందులో పెద్ద భాగం నాకే సొంతం
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నాది అని చెప్పటానికి.. ఎవ్వరూ కూడా తమ ఆహారాన్ని నాకటం కానీ, ఆహారంపై ఉమ్మటం కానీ చెయ్యకూడదు.
  • ఛార్జర్లు.. ఇయర్‌ ఫోన్సు ఇతర వస్తువులు ఎవరివి ఎవరైనా వాడుకోవచ్చు.
  • ఎవరు అడిగినా.. కోక్‌ మాత్రం కొద్దిగా మాత్రమే ఇవ్వబడుతుంది.
  • రక్షా బంధన్‌ రోజు కావచ్చు.. ఇతర సమయాల్లో చిలిపి అల్లర్లు గొడవలకు దారి తీయవచ్చు.
  • ఈ రూల్స్‌పై పెద్ద తోబుట్టువుదే తుది నిర్ణయం

ఇక, ఈ బాండ్‌ పేపర్‌ను చదువుతున్న నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. రక్షా బంధన్‌ రోజు ఈ పిచ్చి పనులు ఏంట్రా అంటూ మండిపడుతున్నారు. కొంతమంది మాత్రం వారికి అండగా నిలుస్తున్నారు. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కూడా ఉండాలంటున్నారు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వైరల్‌ రక్షా బంధన్‌ బాండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet