Pujari Satyendra Das Lord Ram idol: బాల రాముడి ఫొటో నిజమైందేనా?.. అసలు నిజం చెప్పిన ప్రధాన పూజారి!

బాల రాముడి ఫొటో నిజమైందేనా?.. అసలు నిజం చెప్పిన ప్రధాన పూజారి!

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీనికంటే ముందే బాల రాముడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. అసలు ఈ విగ్రహం నిజమైందేనా?

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీనికంటే ముందే బాల రాముడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. అసలు ఈ విగ్రహం నిజమైందేనా?

ఈ నెల 22న అయోధ్యా నగరంలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరుగనున్నది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఇప్పటికే రామ్ మందిర్ ట్రస్టు వారు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో రామ భక్తులు ఈ చారిత్రకమైన ఘట్టాన్ని వీక్షించేందుకు అయోధ్యకు తరలిరానున్నారు. అయితే రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ముందే బాల రాముడి విగ్రహం సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బాల రాముడి విగ్రహం నిజమైనదేనా? దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యలో కొదండ రాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో దేశమంతా రామనామంతో మారుమ్రోగిపోతోంది. రామయ్య దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణ ప్రతిష్ట కంటే ముందే బాలరాముడి ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై వేద పండితులు మండిపడుతున్నారు. అయితే అసలు బాలరాముడి విగ్రహం నిజమైందేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై శ్రీరామ ఆలయ ట్రస్టు ప్రధాన పూజారి క్లారిటీ ఇచ్చారు. ఆ విగ్రహం నిజమైంది కాదని ఆయన తెలిపారు. ఏ ఆలయంలోనైనా దేవతా మూర్తుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట పూర్తి కాకముందే బహిర్గతం చేయరని వెల్లడించారు.

కాగా ఇటీవల రామ్ లల్లా విగ్రహానికి వస్త్రంతో కప్పి ఉంచిన ఫోటో బయటికి రాగా.. ఆ తర్వాత కేవలం కళ్లకు గంతలు కట్టి ఉన్న విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చివారాఖరికి బాలరాముడి పూర్తి విగ్రహరూపం కనపించేలా ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలో అయోధ్య‌లో ప్రాణ ప్ర‌తిష్ట‌ కార్య క్రమం పూర్తి కాకముందే బాలరాముడి విగ్ర‌హం కళ్లను ఎలా చూపించార‌ని పూజారి స‌త్యేంద్ర దాస్ ప్ర‌శ్నించారు. ప్రాణ ప్ర‌తిష్ట కార్యక్రమం పూర్తి అయ్యే వ‌ర‌కు శ్రీరాముడి విగ్ర‌హం కళ్లను బ‌హిర్గతం చేయ‌రాదని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

ఈ సందర్భంగా కళ్లకు ఉన్న వ‌స్త్రాన్ని తీసి ఉన్న ఫోటోలు నిజ‌మైన‌ రాముడి విగ్రహానికి సంబంధించినవి కావు అని స‌త్యేంద్ర దాస్ తెలపడంతో సంచలనంగా మారింది. బాలరాముడి విగ్రహం బహిర్గతం అయిన ఘటనపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. మరో వైపు వేద పండితులు ప్రాణ ప్రతిష్ట కంటే ముందే రామ్ లల్లా విగ్రహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం తప్పని.. పాపం తగులుతుందని హెచ్చరిస్తున్నారు. అతి భక్తితో కొందరు చేసే ఈ చర్యల వల్ల రామ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలరాముడి విగ్రహం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments