iDreamPost
android-app
ios-app

ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. షాకిచ్చిన సర్కార్!

  • Published Feb 10, 2024 | 8:33 AM Updated Updated Feb 10, 2024 | 8:33 AM

Wedding Shoot in Operation Theatre: ఈ మధ్య వివాహవేడుకలు చాల వెరైటీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.

Wedding Shoot in Operation Theatre: ఈ మధ్య వివాహవేడుకలు చాల వెరైటీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.

  • Published Feb 10, 2024 | 8:33 AMUpdated Feb 10, 2024 | 8:33 AM
ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. షాకిచ్చిన సర్కార్!

వివాహం అనేది గొప్ప అనుభూతి.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ పిల్లల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇటీవల పెళ్లి వేడుకల చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. ఇందుకోసం భూమి, ఆకాశం, సముద్రం దేన్నీ వదలడం లేదు. నిశ్చితార్థం తర్వాత  ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఊదరగొడుతున్నారు. రక రకాల ప్రదేశాల్లో రక రకాల ఫోటో షూట్స్,వీడియోస్ తో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. కొంతమంది ఏకంగా సినిమా స్టైల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఓ డాక్టర్ తన ప్రీ వెడ్డింగ్ షూట్ మరీ వెరైటీగా ఉండాలని ప్లాన్ చేశాడు.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ డిఫరెంట్ స్టైల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నా.. అవే కొన్నిసార్లు వాళ్ల కొంపముంచుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ కోసం యువ వైద్యుడి నిర్వాకం.. చివరికి ఉద్యోగం పోయే పరిస్థితికి వచ్చింది. కర్ణాటక భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ బేస్ కింద డాక్టర్  తన భాగస్వామితో కలిసి ఆపరేషన్ థియేటర్లో రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు ఫోటోలు, వీడియో తీయించుకున్నాడు. అది కాస్త వైద్యవర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎంతో పవిత్రంగా భావించే వైద్య వృత్తిలో ఇలాంటి పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్ ని వెడ్డింగ్ షూట్ కోసం ప్లాన్ చేయడం వైద్య వృత్తికి కలంకం అంటూ విమర్శిస్తున్నారు.

డాక్టర్ తన భాగస్వామితో ఆపరేషన్ థియేటర్లో తీసుకున్న వెడ్డింగ్ షూట్ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రిదినేష్ గుండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేధికగా ప్రకటించారు. ఆస్పత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికి.. ఇలాంటి ఎంజాయ్ మెంట్స్ కోసం కాదని ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సామాన్యులకు ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తుందని.. వాటిని దుర్వినియోగం చేయడం, అప్రతిష్టపాలు చేయడం చేస్తే సహించేది లేదని అన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom