iDreamPost
android-app
ios-app

వినూత్న సెలబ్రేషన్.. ఉద్యోగం వచ్చిందని పోస్టర్లు వేపించాడు

  • Published Oct 04, 2023 | 4:55 PM Updated Updated Oct 04, 2023 | 4:55 PM
  • Published Oct 04, 2023 | 4:55 PMUpdated Oct 04, 2023 | 4:55 PM
వినూత్న సెలబ్రేషన్.. ఉద్యోగం వచ్చిందని పోస్టర్లు వేపించాడు

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం వచ్చిందంటే చాలు అందరికీ స్వీట్స్ పంచుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ ఓ వ్యక్తి తనకు ఉద్యోగం వచ్చిన ఆనందాన్ని వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. రాజకీయ నాయకుల మాదిరిగా పోస్టర్లు వేపించుకుని మరీ ప్రచారం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బర్తుడే పోస్టర్లు చూశాం.. మ్యారేజ్ పోస్టర్లు చూశాం.. ఉద్యోగం వచ్చినందుకు పోస్టర్లతో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీక్షిత్ కను పాండే అనే వ్యక్తికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. కాగా ఆ ఉద్యోగంలో త్వరలో చేరనున్నాడు. ఈ క్రమంలో తాను జాయిన్ అయ్యే విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్లు వేపించాడు ప్రతీక్షిత్. ఆ పోస్టర్ తో కూడిన పోస్టును తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ప్రతీక్షిత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ పోస్టర్ లో మెడలో పూల దండలతో విక్టరీ సింబల్ చూపిస్తూ ప్రతీక్షిత్ “జనవరి నుంచి యూసీ శాంటా బార్బరాలో కమ్యూనికేషన్ విభాగంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని వెల్లడించాడు. ప్రతీక్షిత్ చేసిన ఈ పోస్టు నెట్టిట వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet