P Venkatesh
Vande Bharat Trian: ప్రయాణికులకు కొత్తగా మరో మూడు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని మోడీ మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
Vande Bharat Trian: ప్రయాణికులకు కొత్తగా మరో మూడు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని మోడీ మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
P Venkatesh
రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వేలో సంస్కరణలకు తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు సెమీ హైస్పీడ్ ట్రైన్లను తీసుకొచ్చింది. దేశంలో వేలాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. సుధూర ప్రాంతాలకు వెళ్లే వారు ట్రైన్ జర్నీకే ప్రియారిటీ ఇస్తుంటారు. ఈ క్రమంలో వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరిగింది. ఇప్పటికే దేశంలో పలు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు ప్రయాణికులకు కొత్తగా మరో మూడు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి.
వందే భారత్ రైళ్లలో ఉండే సౌకర్యాలు, స్పీడుతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వందే భారత్ లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీసేందుకు రెడీ అవుతున్నాయి. అందులో చెన్నై-ఎగ్మూర్ నుంచి నాగర్ కోయిల్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
చెన్నై ఎగ్మూర్-నాగర్ కోయిల్ మధ్య దూరం 724 కిలో మీటర్లు. ఈ దూరాన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది గంటల వ్యవధిలో చేరుకుంటుంది. ఈ రైలుతోపాటే మరో రెండు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్నారు. మధురై- బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోడీ ప్రారంభిస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే వివిధ నగరాల మధ్య 51 రైళ్లు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.