PM Kisan Yojana: PM కిసాన్ డబ్బు ఇంకా పొందని వాళ్లు.. ఇలా చేయండి!

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకుని వచ్చింది. వాటిలో ఒకటి పీఎం కిసాన్ యోజన. ఎంతో మంది అన్నదాతలకు ఇదొక వరం.. అయితే తాజాగా దీని 17 వ ఎపిసోడ్ ను విడుదల చేశారు. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకుని వచ్చింది. వాటిలో ఒకటి పీఎం కిసాన్ యోజన. ఎంతో మంది అన్నదాతలకు ఇదొక వరం.. అయితే తాజాగా దీని 17 వ ఎపిసోడ్ ను విడుదల చేశారు. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ప్రధాన మంత్రి కిసాన్ యోజన.. ఇది రైతుల పాలిట నిజంగా ఓ వరం అని చెప్పుకోవచ్చు.. రైతుల పాలిట కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతుంది. వాటిలో ఒకటి.. కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఎంతో మంది రైతులకు ఈ పథకాల ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన రైతులకు కేంద్రం రూ. 6000 అందిస్తుంది. కానీ ఒకేసారి కాకుండా.. మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు. అంటే ఒక్కో విడతలో రూ. 2000 రైతులకు అందిస్తారు. 16వ విడతను ఫిబ్రవరి 28న విడుదల చేయగా.. . ఇక తాజాగా దీనికి సంబంధించిన 17వ ఎపిసోడ్ ను విడుదల చేశారు..దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

నరేంద్ర మోడీ 17వ విడత ఫైల్ పైన సంతకం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో.. రైతులుకు పెట్టుబడి సౌకర్యాలు కలుగుతున్నాయి. అయితే ఒకవేళ ఈ పథకాలను తీసుకునే వారు.. ఆల్రెడీ ఇంతకముందు ఈ పథకంలో లబ్ధిదారులైతే.. ఈ-కేవైసీ చేయనిదే.. ఆ అమౌంట్ క్రెడిట్ చేయడానికి వీలు కలగదు. పీఎం కిసాన్ యోజన 17వ విడత ప్రతి సంవత్సరం జూన్‌ లో విడుదల అవుతుంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా జూన్ నెలలోనే .. ఈ ఫండ్స్ విడుదల కానున్నాయి. వరుసగా మూడవ సారి ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ. మొదటిగా ఈ ఫైల్ మీదనే సంతకం చేశారు. అయితే ఈ పథకానికి అర్హులైన వారు మాత్రం తప్పకుండ ఈ-కేవైసీ ని చేయించుకోవాలి. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా.. పూర్తి చేసుకోవాలి. దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

ముందుగా.. పీఎం సాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ లభిదారుల ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్ కు OTP పంపబడుతుంది. దానిని ఎంటర్ చేస్తే చాలు మీ ఈ-కేవైసీ పూర్తయినట్లే. ఒకవేళ మీరు అందిస్తున్న సమాచారంలో ఏవైనా లోపాలు ఉంటె కనుక వాటిని వెంటనే సరిదిద్దాలి. లేదంటే లబ్ధిదారుల ఖాతాలోకి అమౌంట్ క్రెడిట్ అవ్వదు. ఇక ఎటువంటి సమస్యలైన చెప్పుకునేందుకు.. pmkisan-ict@gov.inకి ఇమెయిల్ చేయవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments