Swetha
తాజాగా మిజోరంలో మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ప్రమాదానికి గురి అయింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు సమాచారం. భాదితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు పేర్కొన్నారు.
తాజాగా మిజోరంలో మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ప్రమాదానికి గురి అయింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు సమాచారం. భాదితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు పేర్కొన్నారు.
Swetha
సాధారణంగా విమానాలు కొన్ని సార్లు అదుపు తప్పి ప్రమాదాలకు గురి అవుతూనే ఉంటాయి. అధికారులు దానికి తగిన జాగ్రత్తలు ఎప్పటికపుడు తీసుకుంటూ ఉన్నా సరే. కొన్ని సార్లు అప్రమత్తంగా ఉండి తీరాలి. గతంలోనూ దీనికి సంబంధించిన వార్తలు ఎన్నో చూశాము. ఇప్పుడు తాజాగా మిజోరాం సమీపంలో ఆర్మీకి చెందిన ఓ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. అది కూడా ఎయిర్పోర్ట్ రన్ వే పై దిగుతుండగా అదుపు తప్పి కొంతదూరం పాటు పొదల్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటికి సుమారు ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడినట్టుగా సమాచారం. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వారి దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా..సరిహద్దుల దాటి భారత్‌లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను.. వారి స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది . ఈ ఘటన మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో జరిగింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఈ విమానంలో 13 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఇలా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్‌వేలపై విమానాలను ల్యాండింగ్ చేయడం.. అంత సాధారణ విషయం కాదు. ఇలాంటి రన్‌వే లు ఇండియాలో కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి కారణంగా విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్‌వే నుంచి జారి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంత అపప్రమత్తంగా ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాలు అడపా దడపా జరుగుతూనే ఉంటాయి.
ఇక మయన్మార్‌లో జరుగుతున్న ఘర్షణల విషయానికొస్తే.. అక్కడ తిరుగుబాటు గ్రూపులతో జరుగుతున్న ఘర్షణల కారణంగా.. ఆ దేశం నుంచి భారీగా సైనికులు ఇండియాలోకి చొరబడుతున్నారు. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో 184 మంది సైనికులను భారత్ సోమవారం వెనక్కి పంపినట్లు సమాచారం. అంతేకాకుండా.. స్వతంత్ర రాఖైన్ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్ తిరుగుబాటు బృందం.. ‘అరాకన్ ఆర్మీ’ సైనికులు గతవారం దేశ సైనిక క్యాంప్‌పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని.. భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద.. ఒక గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో లొంగిపోయారు. వీరి వద్ద ఆయుధాలు, ఇతర మందు సామగ్రి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. ఆ తరువాత వారిని లుంగ్లీకి మార్చారు. ఇక ఇప్పుడు ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి.. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు.. మయన్మార్ కు చెందిన విమానాల్లో సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించామని .. అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. అలాగే, మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్ తరలిస్తామని తెలియజేశారు.