Swetha
మతం పేరుతో మారణ హోమాలు జరిగేవి అయితే.. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారిపోయింది. భిన్నత్వంలో ఏకత్వం అనే వ్యాఖ్యానికి నిదర్శనగా ప్రవర్తిస్తున్నారు భారతీయులు.. అసలు ఏం జరిగిందంటే...
మతం పేరుతో మారణ హోమాలు జరిగేవి అయితే.. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారిపోయింది. భిన్నత్వంలో ఏకత్వం అనే వ్యాఖ్యానికి నిదర్శనగా ప్రవర్తిస్తున్నారు భారతీయులు.. అసలు ఏం జరిగిందంటే...
Swetha
ఒకప్పుడు హిందువులు, ముస్లింలకు సంబంధించిన గొడవల గురించి ఎక్కువగా వింటూ ఉండే వాళ్ళం. కానీ, ఇప్పుడు అటువంటి వాటి అన్నిటికి విరుద్ధంగా..కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ముస్లింలు. ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం కేవలం భారతీయులకు మాత్రమే సొంతం అని చెప్పి తీరాలి. ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు ఇక్కడ మాట విద్వేషాలను రెచ్చగొడుతున్న సరే.. ఇక్కడ మాత్రం అందరూ కలిసి మెలసి జీవిస్తున్నారు. ఒకరి ఆచార వ్యవహారాలను మరొకరు గౌరవించడం మాత్రమే కాకుండా.. ఒకరి ఆలయాలకు మరొకరు సాయం కూడా చేస్తున్నారు. తాజాగా మత సామరస్యాన్ని చాటే ఇఓ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందువుల ఆలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి తన పంట భూమిని హిందువుల కోసం దానం చేశారు. దానికి సంబంధిచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టించే వారికి ఈ సంఘటన గుణపాఠం లా మారింది. ఏం జరిగిందంటే కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో.. పురాతన హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు.. తమ సొంత భూమిని దానం చేశారు. కాన్సీపట్టా గ్రామంలో గౌరీ శంకర్ ఆలయం కోసం.. 10 అడుగుల వెడల్పుతో 1200 మీటర్ల రహదారిని నిర్మించాలని భావించారు. అయితే, ఆ మార్గంలో రసూల్, మహ్మద్‌లకు చెందిన వ్యవసాయ భూమి ఉంది. దీనితో గ్రామా పెద్దలు వారిని సంప్రదించగా.. వారు ఇరువురు అందుకు అంగీకరించారు. తాజాగా పంచాయితీ సభ్యులతో జరిపిన సమావేశంలో .. తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక త్వరలోనే పంచాయతీ నిధులతో .. రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పంచాయతీ మాజీ సభ్యుడు, మాట్లాడుతూ.. రహదారి సమస్యను సాకుగా చూపిస్తూ.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొటేందుకు కొందరు ప్రయత్నిస్తు ఉన్నారని ఆరోపించారు. ఆలయానికి రోడ్డు లేకపోవడంతో మత కల్లోలానికి ప్రయత్నించారని అన్నారు. ఏదేమైనా మత పట్టింపులు లేకుండా ఇలా ఆ ఇద్దరు ముస్లింలు ఆలయం కోసం తమ భూమిని దానం చేయడం అభినందించతగిన విషయం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.