iDreamPost
android-app
ios-app

స్టార్‌బక్స్ కాఫీ కోసం రూ.9.4 లక్షలు ఖర్చు చేసిన జొమాటో కస్టమర్! కంపెనీ సెలబ్రేషన్స్

  • Published Aug 08, 2024 | 9:29 PM Updated Updated Aug 08, 2024 | 9:29 PM

Woman Spent 9.4 Lakhs For Coffee: ఎవరైనా కాఫీ కోసం ఎంత ఖర్చు పెడతారు.? మామూలు వాళ్ళు అయితే రోజుకు గట్టిగా 100 రూపాయలు ఖర్చు పెట్టినా గానీ నెలకు 3 వేలు అవుతాయి. ఏడాదికి 36 వేలు అవుతాయి. అంతేగానీ లక్షలైతే అవ్వవు కదా. కానీ ఒక మహిళ కేవలం కాఫీ కోసం 9.4 లక్షలు ఖర్చు చేసింది.

Woman Spent 9.4 Lakhs For Coffee: ఎవరైనా కాఫీ కోసం ఎంత ఖర్చు పెడతారు.? మామూలు వాళ్ళు అయితే రోజుకు గట్టిగా 100 రూపాయలు ఖర్చు పెట్టినా గానీ నెలకు 3 వేలు అవుతాయి. ఏడాదికి 36 వేలు అవుతాయి. అంతేగానీ లక్షలైతే అవ్వవు కదా. కానీ ఒక మహిళ కేవలం కాఫీ కోసం 9.4 లక్షలు ఖర్చు చేసింది.

  • Published Aug 08, 2024 | 9:29 PMUpdated Aug 08, 2024 | 9:29 PM
స్టార్‌బక్స్ కాఫీ కోసం రూ.9.4 లక్షలు ఖర్చు చేసిన జొమాటో కస్టమర్! కంపెనీ సెలబ్రేషన్స్

జొమాటో, స్విగ్గీ వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక బయటకెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉంటూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. బిర్యానీలు, పీజ్జాలు, బర్గర్లు, కాఫీలు, టిఫిన్లు ఇలా ఒకటేమిటి అన్నీ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. అయితే అందరి కంటే ఎక్కువగా ఫుడ్ మీద ఖర్చు చేసిన వారిని ఫుడ్ డెలివరీ యాప్స్ గుర్తించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. జొమాటో కూడా పలు సందర్భాల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన కస్టమర్స్ గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక మహిళ కాఫీ కోసం ఏకంగా 9.4 లక్షలు ఖర్చు పెట్టి మరీ జొమాటోలో ఆర్డర్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.

ఎవరైనా కాఫీ కోసం ఎంత ఖర్చు పెడతారు? మహా అయితే 400, 500 రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా 9.4 లక్షలు ఖర్చు పెట్టింది. ముంబైకి చెందిన మిష్కట్ అనే మహిళకి స్టార్ బక్స్ కాఫీ అంటే మహా ఇష్టం. దీంతో జొమాటోలో డైలీ కాఫీ ఆర్డర్ చేసుకునేది. అలా ఆమె ఏకంగా 9.4 లక్షల విలువైన స్టార్ బక్స్ కాఫీని జొమాటో ద్వారా ఆర్డర్ చేసింది. దీంతో జొమాటో కంపెనీ స్పెషల్ కస్టమర్ అంటూ ప్రత్యేకంగా ఒక యాడ్ ని రూపొందించింది. ఆ యాడ్ లో మిష్కట్ తల్లిగా ఒక ఆమె నటించారు. ఆమె జొమాటో ఆఫీస్ కి వెళ్తుంది. ఆమె చేతిలో ఒక థాంక్స్ కార్డు ఉంటుంది. జొమాటోలో కాఫీ ఆర్డర్ చేసి 9.4 లక్షలు ఖర్చు చేసినందుకు థాంక్యూ అంటూ జొమాటో ఒక థాంక్స్ కార్డుని ఇచ్చింది. దాన్ని మిష్కట్ తల్లి క్యారెక్టర్ జొమాటో మార్కెటింగ్ హెడ్ కి చూపించి ఏంటిది అని అడుగుతారు.

Woman spent money 9.4 lakhs on starbucks

తన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడుగుతారు. దానికి జొమాటో మార్కెటింగ్ టీమ్ ఆమెకు స్టార్ బక్స్ కాఫీని రుచి చూపిస్తారు. అంతే ఆమె ఫిదా అయిపోతారు. ఈ యాడ్ లో మిష్కట్ అసలు తల్లిని చూపించారు. మిష్కట్ తో పాటు ఆమె తల్లి కూడా ఇక నుంచి స్టార్ బక్స్ లో కాఫీ ఆర్డర్ చేస్తారంటూ యాడ్ ని ఎండ్ చేశారు. అంతేకాదు మిష్కట్ పేరు మీద ఒక కూపన్ కోడ్ ని కూడా రూపొందించారు. ‘మిష్ 100’ అనే కూపన్ కోడ్ తో స్టార్ బక్స్ లో బెవరేజెస్ ఆర్డర్ చేస్తే 100 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇలా తమ ప్రియమైన జొమాటో కస్టమర్ కి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. ఇంతలా ఆమె పడిచచ్చిపోతున్న కాఫీ ధర 500 లోపే ఉంటుంది. అంటే ఆమె ఎంతలా తాగితే 9.4 లక్షలు ఖర్చు పెట్టి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆమె సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ గా మారిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Zomato (@zomato)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss