iDreamPost
android-app
ios-app

ప్రియుడితో పరారైన ముగ్గురు పిల్లల తల్లి.. ఆచూకీ కోసం భర్త వెతుకులాట

  • Published Sep 03, 2023 | 3:06 PM Updated Updated Sep 03, 2023 | 3:06 PM
  • Published Sep 03, 2023 | 3:06 PMUpdated Sep 03, 2023 | 3:06 PM
ప్రియుడితో పరారైన ముగ్గురు పిల్లల తల్లి.. ఆచూకీ కోసం భర్త వెతుకులాట

ఇటీవల దేశంలో ప్రేమకోసం, ప్రేమించిన వ్యక్తుల కోసం ప్రియుడు లేదా ప్రియురాలు దేశాలు దాటి మరి వెళ్లిపోతున్నారు. ప్రేమకు సరిహద్దులు అడ్డుకావు అని నిరూపిస్తున్నారు. ఎంత కష్టమైన తాము కోరుకున్న వ్యక్తుల కోసం కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను సైతం వదిలేసి పోతున్నారు. ఈ క్రమంలో సీమా హైదర్ అనే పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి పబ్జీ గేమ్ ఆడుతూ ఆన్ లైన్ లో యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం పెంచుకుని, అది కాస్త ప్రేమగా మారి అక్రమంగా దేశంలోకి చొరబడిన విషయం తెలిసిందే. ఇదే రీతిలో యూపీలో మరో ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైన మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడి పరార్ అయిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యూపీలోని ఆజంగఢ్ కు చెందిన అనిల్ రాజ్ భర్ అనే వ్యక్తి ఉపాధి కోసం చండీగఢ్ వెళ్లాడు. కొంత కాలం తర్వాత అక్కడ రీనా అనే యువతి పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భార్యను తీసుకుని స్వగ్రామానికి వచ్చిన అనిల్ రాజ్ భర్ అక్కడే కాపురం చేయసాగారు. ఇలా తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలో అనిల్ రాజ్ భర్ బ్రతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ సమయంలోనే రీనాకు ఇతర వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుండేదని అనిల్ రాజ్ భర్ తెలిపాడు. ఈ విషయంపై ఆమెను పలు సార్లు అడిగినా సమాదానం చెప్పకుండా దాటవేసేదని చెప్పాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆమెకు ఎవరి దగ్గరి నుంచో ఫోన్ రాగ ఆమె బయటికి వెళ్లిందని అనిల్ రాజ్ భర్ తెలిపాడు.

అలా వెళ్లిన తను ఇంటికి రాలేదని, ఆమె జాడ కోసం అన్ని ప్రాంతాల్లో వెతికామని కానీ ఆచూకీ ఎక్కడ లభ్యం కాలేదని వెల్లడించాడు. దీంతో తన భార్య మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు రీనా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక చేసేదేం లేక భార్య ఫొటో చేతిలో పట్టుకుని ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని తెలిసిన ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించాడు. ఈ విషయంపై అనిల్ రాజ్ భర్ మాట్లాడుతూ.. తన భార్యకు పెళ్లికి ముందే ఐదుగురు ప్రేమికులు ఉన్నట్లు తనతో చెప్పేదని, కానీ నేను దీనిని నమ్మలేదని ఇప్పుడు ఆమె తన ఐదో ప్రేమికునితో వెళ్లి పోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు అనిల్ రాజ్ భర్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom