iDreamPost
android-app
ios-app

మనీ హెయిస్ట్‌ సీన్‌ రిపీట్‌: నడిరోడ్డుపై డబ్బుల వర్షం కురిపించాడు!

  • Published Oct 03, 2023 | 10:01 PM Updated Updated Oct 03, 2023 | 10:01 PM
  • Published Oct 03, 2023 | 10:01 PMUpdated Oct 03, 2023 | 10:01 PM
మనీ హెయిస్ట్‌ సీన్‌ రిపీట్‌: నడిరోడ్డుపై డబ్బుల వర్షం కురిపించాడు!

మనీ హెయిస్ట్‌ వెబ్‌ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వెబ్‌ సిరీస్‌ స్పూర్తితో పిచ్చి పిచ్చి పనులు చేసే వారి సంఖ్య పెరిగిందంటే.. దాని ప్రభావం ఎంతుందో ఇట్టే చెప్పేయవచ్చు. తాజాగా, ఓ వ్యక్తి మనీ హెయిస్ట్‌ వెబ్‌ సిరీస్‌లోని ఓ సీన్‌ను నిజ జీవితంలో ఇట్టే దించేశాడు. రోడ్డుపైకి వచ్చి డబ్బుల్ని రోడ్డుపై వెదజల్లాడు. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కొద్దిరోజుల క్రితం రాజస్తాన్‌లోని ఓ రోడ్డు మీద ఉన్నట్టుండి ఓ కారు ఆగింది. ఆ కారులోంచి ఓ వ్యక్తి దిగాడు. అతడు మనీ హెయిస్ట్‌ వెబ్‌ సిరీస్‌లోలాగా మాస్కు, బట్టలు ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి కారులోంచి బయటకు దిగిన వెంటనే.. కారు పైకి ఎక్కాడు. ఆ వెంటనే తన భుజానికి ఉన్న బ్యాగులోంచి డబ్బులు బయటకు తీసి విసరటం మొదలుపెట్టాడు. అతడు డబ్బులు విసరటం గుర్తించిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకర్ని ఒకరు తోసుకుంటూ డబ్బుల కోసం కొట్టుకున్నారు.

అంతేకాదు! అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అతడి చర్యను తప్పుబడుతుంటే.. మరికొంతమంది ప్రజలకు సాయం చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş