ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రతన్ టాటా పేరుతో..

Ratan Tata: విలువలతో కూడిన వ్యాపారం, దాతృత్వం, దయా గుణం కలిగిన టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. నిరాడంబరమైన జీవనశైలి.. వ్యక్తిగత సంపదన కన్నా సామాజిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

Ratan Tata: విలువలతో కూడిన వ్యాపారం, దాతృత్వం, దయా గుణం కలిగిన టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. నిరాడంబరమైన జీవనశైలి.. వ్యక్తిగత సంపదన కన్నా సామాజిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ సంతస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) అనారోగ్యంతో బుధవారం రాత్రి ముంబాయిలోని బ్రిచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు.దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించిన వ్యాపార దిగ్గజం. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామా.. ప్రపంచం మెచ్చిన పారిశ్రామి వేత్త. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి.. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేశ వ్యాపార రంగానికే ఒక పర్యాయపదం అని అంటారు. ఆయన మృతితో యావత్ భారత దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రతన్ టాటా గౌరవార్థం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వ్యాపార దిగ్గజం రతన్ టాటా గురించి భారతీయులకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఉప్ప నుంచి ఉక్కు వరకు.. టీ నుంచి ట్రక్స్ వరకు ఎన్నో ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ టాటా గ్రూప్స్. ప్రపంచంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలు అనంతం. ఈ క్రమంలోనే ఆయన గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత దేశంలో ఇండస్ట్రీయల్ అవార్డులను ‘రతన్ టాటా’ పేరుతో ఇవ్వాలని నిర్ణయించింది. పారిశ్రామిక రంగంలో కృషి చేసిన వారికి రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు పేరుతో సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

అంతే కాదు ఇకపై ముంబాయిలోని ఉద్యోగ భవన్ ని కూడా రతన్ టాటా ఉద్యోగ భవన్ గా మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే తొలి ఇండస్ట్రీయల్ అవార్డును 2023 లో మొదటిగా రతన్ టాటానే అందుకోవడం గమనార్హం. ఆయన అందుకున్న తొలి అవార్డును ఆయన పేరుతో ఇవ్వడం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అని ప్రభుత్వం అంటుంది. నిన్న మహారాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర కేబినెట్ రతన్ టాటాకు సంతాపం ప్రకటించి.. అనంతరం, దేశానికి ఆయన చేసిన సేవలకు గాను అత్యుత్తమ పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది మంత్రి వర్గం.

1991లో జేఆర్‌డీ టాటా నుంచి చైర్మన్ గా గ్రూప్ బాధ్యతలు స్వీకరించాక వివిధ రంగాలకు వ్యాపారాలను విస్తరించారు రతన్ టాటా. తన పదవీ కాలంలో టాటా గ్రూప్ కంపెనీలను అంతర్జాతీయ సంస్థలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లీస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ చూస్తే.. ఆగస్టు 20 , 2024 నాటికి సుమారు రూ.33.7 లక్షల కోట్లు. ఇక టాటా గ్రూప్ లోని ఉన్న అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందకే వస్తాయి. టాటా సన్స్ ఈ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ సంస్థ తన అన్ని సంస్థల మొత్తం ఆదాయంలో 66 శాతం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రజలు, దేశం ఏదైనా విపత్తులు సంభవిస్తే ఖర్చు చేస్తారు. రతన్ టాటా మొదటి నుంచి వ్యక్తిగత సంపద పోగు చేయడం కన్నా సామాజిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందుకే ఆయన దేశం మెప్పిన వ్యాపార దిగ్గజం అంటారు.

Show comments