పేలిన 108 అంబులెన్స్.. నిండు గర్భిణి సహా..

Ambulance Blast: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు చూస్తుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటి ఘటనే మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది.

Ambulance Blast: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు చూస్తుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటి ఘటనే మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ అంబులెన్స్ లో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా ఆ అంబులెన్స్ నుంచి మంటలు చెలరేగాయి. కొద్ది సేపటి తర్వాత ఆ మంటలకు అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ బాంబ్ లా పేలిపోయింది. అప్పటికే అంబులెన్స్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో నిండు గర్భిణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కిందకు దించి పక్కకు వెళ్లిపొమన్నాడు. దీంతో అందరూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ భాయానక సంఘటన మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాకు చెందిన ఓగర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 ఫోన్ చేసి సమాచారం అందించారు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. గర్భిణితో పాటు కుటుంబ సభ్యులు జల్గావ్ జిల్లా ఆస్పత్రికి  బయలుదేరారు. అయితే ఇంజన్ నుంచి మెల్లిగా పొగలు రావడాన్ని గమనించాడు డ్రైవర్.  నడిరోడ్డుపైనే వాహనాన్ని ఆపి, అందరినీ వెంటనే కిందకు దిగి సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాడు. వారంతా హుటాహుటిన కిందకు దిగి దూరంగా వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మంటలకు  ఆక్సీజన్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలిపోయింది.పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు ద్వంసం అయ్యాయి. చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో కాలిపోయింది. అయితే ఈ సంఘటన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి నిండు గర్భిణితో సహా వారి కుటుంబాన్ని కాపాడిన డ్రైవర్ అన్నపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవల అత్యవసర సమయంలో అంబులెన్స్ సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. సకాలంలో అంబులెన్స్ రాక ప్రాణాలో కోల్పోతున్నారని, మృత దేహాలను భుజాలపై వేసుకొని కిలోమీటర్ల మేర నడుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.  అలాంటిది ఓ అంబులెన్స్ డ్రైవర్ సమయస్ఫూర్తీ వల్ల ఓ కుటుంబం ప్రాణాలతో ఉందని అంటున్నారు. ఈ మధ్యనే ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నంద‌పూర్ సమితి పంతు‌లుంగ్ గ్రామపంచాయతీకి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అంబులెన్స్ వచ్చినప్పటికీ రెండు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. పరిస్థితి అర్ధం చేసుకున్న అంబులెన్స్ సిబ్బంది నడుచుకుంటూ గ్రామానికి వెళ్లి గర్భవతిని స్ట్రచెర్ పై రెండు కిలోమీటర్లు మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు చేర్చారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో తల్లీపిల్ల ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మానవత్వంతో స్పందించిన తల్లీబిడ్డను కాపాడిన అంబులెన్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

Show comments