iDreamPost
android-app
ios-app

వీడియో: ఓయో రూమ్ కావాలంటూ ఎమ్మెల్యే ఆఫీసులో ప్రేమ జంట ముద్దులతో నిరసన..

  • Published May 12, 2024 | 11:48 AM Updated Updated May 12, 2024 | 11:48 AM

యువతీ, యువకుల పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఓయో రూమ్ కోసం ఏకంగా ఒక ప్రేమ జంట బీజేపీ కార్యాలయానికి వెళ్లి మరీ నిరసన చేపట్టింది. తమకు ఓయో రూమ్ లు కావాలంటూ మరీ ముద్దులతో నిరసన చేపట్టింది. 

యువతీ, యువకుల పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఓయో రూమ్ కోసం ఏకంగా ఒక ప్రేమ జంట బీజేపీ కార్యాలయానికి వెళ్లి మరీ నిరసన చేపట్టింది. తమకు ఓయో రూమ్ లు కావాలంటూ మరీ ముద్దులతో నిరసన చేపట్టింది. 

  • Published May 12, 2024 | 11:48 AMUpdated May 12, 2024 | 11:48 AM
వీడియో: ఓయో రూమ్ కావాలంటూ ఎమ్మెల్యే ఆఫీసులో ప్రేమ జంట ముద్దులతో నిరసన..

సాధారణంగా ఒక ఎమ్మెల్యేని ఎవరైనా ఏం అడుగుతారు. మాకు రోడ్లు బాలేదు.. రోడ్లు వేయించండి. మాకు తాగునీటి సదుపాయం లేదు. నీటి వసతి కల్పించండి. మాకు ఇల్లు లేదు ఇల్లు ఇప్పించండి అని అడుగుతారు. కానీ ఈ ప్రేమికులు మాత్రం తమకు ఓయో రూమ్ లు కావాలంటూ ఎమ్మెల్యే ఆఫీసులో నిరసన చేపట్టారు. మీరు ఇవ్వకపోతే ఇక్కడే పని కానిచ్చేస్తాం అనేలా ముద్దులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

బీజేపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఓయో రూమ్ లను మూసివేయించారు. ఓయో రూమ్స్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కారణంతో సదరు ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓయో రూమ్స్ ని మూయించేశారు. దీంతో ఆ ఓయో రూమ్స్ ని తిరిగి ఓపెన్ చేయించాలని గత కొన్ని రోజులుగా ప్రేమికులు డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఒక ప్రేమ జంట ఏకంగా బీజేపీ ఆఫీసులోనే బిచాణా పెట్టేసింది. మీరు ఓయో రూమ్స్ ఓపెన్ చేస్తారా? లేక ఈ ఆఫీస్ నే ఓయో రూమ్స్ గా వాడుకోమంటారా? అనేలా ముద్దులతో రెచ్చిపోయారు.

ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలో వైశాలి నగర్ లో బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్.. తన నియోజకవర్గంలో ఓయో రూమ్స్ ని బలవంతంగా మూయించేశారు. ఓయో రూమ్స్ లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని.. అశ్లీలత పెరిగిపోతుందని.. తన నియోజకవర్గ పరిధిలో ఇలాంటివి జరగడానికి వీల్లేదంటూ ఓయో రూమ్స్ ని క్లోజ్ చేయించారు. ప్రేమ జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్ ని వాడుకుంటున్నారని రికేష్ సేన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై నిరసనగా ఎమ్మెల్యే కనిపించిన చోట ప్రేమికులు.. ఓయో రూమ్ లు తిరిగి తెరిపించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

తమ మాట ఖాతరు చేయడం లేదని ఒక ప్రేమ జంట ఇలా బీజేపీ కార్యాలయంలోనే ముద్దులతో నిరసన తెలిపింది. ఓయో రూమ్ లు మూసేస్తే మేము ఎక్కడికి పోవాలి అంటూ నిరసన తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి కోసం నిరసన తెలిపే రోజులు పోయి చివరకు ఓయో రూమ్స్ కోసం, అసాంఘిక కార్యకలాపాల కోసం నిరసనలు తెలిపే పరిస్థితికి భారతదేశం వచ్చిందా? ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేని ఏమడగాలో తెలియనంత అజ్ఞానంలో ఉన్నారా ఈ చదువుకున్న మూర్ఖులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.          

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş