ఇదేం చిత్రం.. అక్కడ రెండో స్థానంలో నోటా.. ఏకంగా లక్షన్నర ఓట్లు!

Lok Sabha Election Results 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఓ చోట మాత్రం నోటా ఏకంగా లక్షన్నర ఓట్లు సాధించి.. రెండో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

Lok Sabha Election Results 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఓ చోట మాత్రం నోటా ఏకంగా లక్షన్నర ఓట్లు సాధించి.. రెండో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దేశంలో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ఇండియా కూటమి కూడా బలమైన పోటీ ఇస్తోంది. దాంతో కౌంటింగ్‌ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎ‍గ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తారుమారయ్యాయి. ఊహించని రీతిలో ఇండియా కూటమి పుంచుకుని.. ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఓ చోట వెలువడిన ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎక్కడకైనా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గెలిచిన వారికి ఎక్కువ ఓట్లు వస్తాయి. ఆ తర్వాత స్థానంలో ఓడిపోయిన వారు ఉంటారు. అంటే రెండో స్థానంలో అన్నమాట. కానీ ఓ చోట మాత్రం.. నోటా ఏకంగా లక్షన్నర ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇంతకు ఆ నియోజకర్గం ఎక్కడ.. అంటే..

అత్యధిక ఓట్లు సాధించి.. నోటా రెండో స్థానంలో నిలిచిన ఆ నియోజకవర్గం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌. ఈ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్‌ జరిగింది. ఇక్కడ బీజేపీ నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌ మాత్రం చివరి క్షణంలో (ఏప్రిల్‌ 29న) నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరారు. దాంతో అక్కడ కాంగ్రెస్‌ పోటీలో లేకుండానే పోయింది. క్షయ్‌కాంతి బామ్‌ తీరుతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు.. తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం విభిన్నమైన పద్దతిని ఎన్నుకున్నారు. దాంతో ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేయడమే కాక.. పోలింగ్‌ రోజున దాన్ని నిజం చేసి చూపారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలనుకున్న ఓటర్లు నోటాకు తమ ఓటేశారు. ఇక నేడు కౌంటింగ్‌లో భాగంగా.. ఇక్కడ బీజేపీ తరఫున బరిలో దిగిన శంకర్‌ లాల్వానీ 10 లక్షల ఓట్లతో.. 8.5 లక్షల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా నోటాకే ఓట్లు పడ్డాయి. దాదాపు 1.85 లక్షల ఓట్లతో నోటా రెండో స్థానంలో నిలబడటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని భావించిన వారు.. నోటాకు తమ ఓటేశారు.

ఇక ఇక్కడ రెండో స్థానంలో ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థికి 43 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకంటే నోటాకు వచ్చిన ఓట్లే దాదాపు లక్షన్నర అధికం కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో 25.13 లక్షల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల చరిత్రలో గతంలో బిహార్‌ గోపాల్‌గంజ్‌ స్థానంలో నోటాకు 51వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును ఇండోర్‌ అధిగమించింది. ఏకంగా లక్షన్నర ఓట్లు సాధించి.. రెండో స్థానంలో నిలిచింది.

Show comments