iDreamPost
android-app
ios-app

తండ్రిని అమ్మకానికి పెట్టిన ఎనిమిదేళ్ల కుమార్తె.. పిక్ వైరల్

  • Published Oct 09, 2023 | 3:41 PM Updated Updated Oct 09, 2023 | 3:41 PM
  • Published Oct 09, 2023 | 3:41 PMUpdated Oct 09, 2023 | 3:41 PM
తండ్రిని అమ్మకానికి పెట్టిన ఎనిమిదేళ్ల కుమార్తె.. పిక్ వైరల్

చిన్న పిల్లలు తమకు నచ్చిందీ కావాలనో లేదా కొనివ్వాలంటూ మారాం చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు కూడా వారి సంతోషం కోసం వారు అడిగనవ్నీ కాదనకుండా తెచ్చి ఇస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వద్దని వారిస్తుంటారు. ఇక అక్కడ మొదలౌతుందీ అసలు పేచీ. తాము అడిగిందీ ఇవ్వలేదంటూ పిల్లలు బుంగమూతి వేసుకుని అలగడం, లేదంటే తిండి మానేయడం, ఏడ్వడం చేస్తుంటారు. తల్లిదండ్రులపై మౌన వ్రతం పాటిస్తుంటారు. ఆ తర్వాత బలిమాలాడితే.. ఇక మామూలు అయిపోతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే చిన్నారి మాత్రం ఏకంగా తన తండ్రిని అమ్మేసేందుకు సిద్ధమైంది. మరీ అమ్మాలంటే కొనుక్కునే వాళ్లు ఉండాలి కదా.

ఆ విషయం జనాలకు తెలియాలని ఏకంగా ఇంటి ముందు బోర్డు పెట్టింది. ఈ చిన్నారి చేసిన పనిని స్వయంగా తండ్రే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తండ్రి ఏం కొనివ్వనన్నాడో.. లేక డబ్బులు లేవని సమాధానమిచ్చాడో తెలియదు.. బాగా హర్ట్ అయిన చిన్నారి ఏకంగా తన నాన్ననే అమ్మేస్తున్నట్టు పేర్కొంది. ‘ఫాదర్ ఫర్ సేల్’ అని ఓ ప్రకటనలో పేర్కొంది ఎనిమిదేళ్ల చిన్నారి. దానిలో తండ్రి విలువ రూ. 2 లక్షలుగా పేర్కొంది. మరింత సమాచారం కోసం ఇంటి కాలింగ్ బెల్ నొక్కండి అని ఫ్లకార్డుపై రాసి ఇంటి గేటుకు తగిలించింది. దీన్ని నెట్టింట్లో పంచుకున్న తండ్రి.. తనపై అసంతృప్తితో ఉన్న తన కూతురు ఇలా నోటీసు అంటించిందని, తనకు తగినంత విలువ లేదంటూ పేర్కొన్నారు.

ఈ పిక్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు దీనికి వేల సంఖ్యలో లైక్స్, వ్యూస్ వచ్చాయి. కాగా, దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ వయస్సులో రెండు లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువని, మీ అమ్మాయి మీకు చాలా విలువనిచ్చిదంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. కష్టసమయాల్లో కూడా మీ సహనం, అవగాహన ప్రత్యేకం అంటూ రాసుకొచ్చారు మరో నెటిజన్. ఆ చిన్నారి చేసిన పని మీకెలా అనిపిస్తుందో అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom