nagidream
Lady Influencer Kavya Karnatac Who Denied Anant Ambani Wedding Promotion: ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నాక వారికి ప్రమోషన్స్ వస్తుంటాయి. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయమని ఆఫర్ చేస్తుంటాయి. ఇటీవల ముఖేష్ అంబానీ నుంచి ఓ లేడీ ఇన్ఫ్లుయెన్సర్ కి కూడా ఒక ఆఫర్ వచ్చింది. కానీ ఆ యువతి మాత్రం చేయను అని మొఖం మీదనే చెప్పేసింది. ఎందుకు ఆమె నో చెప్పారు? దీనికి గల కారణాలు ఏమిటి?
Lady Influencer Kavya Karnatac Who Denied Anant Ambani Wedding Promotion: ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నాక వారికి ప్రమోషన్స్ వస్తుంటాయి. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయమని ఆఫర్ చేస్తుంటాయి. ఇటీవల ముఖేష్ అంబానీ నుంచి ఓ లేడీ ఇన్ఫ్లుయెన్సర్ కి కూడా ఒక ఆఫర్ వచ్చింది. కానీ ఆ యువతి మాత్రం చేయను అని మొఖం మీదనే చెప్పేసింది. ఎందుకు ఆమె నో చెప్పారు? దీనికి గల కారణాలు ఏమిటి?
nagidream
ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కావ్య కర్ణాటక్ బయటపెట్టిన విషయంతో ఇప్పుడు ఆమె వార్తల్లో హెడ్ లైన్స్ గా మారిపోయారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకను ప్రమోట్ చేయడం కోసం తనకు 3.6 లక్షలు ఆఫర్ చేశారట. కానీ ఆమె ససేమిరా చేయను అని తెగేసి చెప్పేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ ఆమె అప్పటి వరకూ ప్రమోషన్స్ కోసం తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువే. అయినప్పటికీ ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించారు. మామూలుగా అంబానీకి సంబంధించి ఏదైనా ప్రమోషన్ వస్తే చేయడానికి ఎవరూ వెనుకాడరు. కానీ ఈమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమె రిజెక్ట్ చేశారు. దీనికి కారణం తన బ్రాండ్ వేల్యూ అని.. అది తనకు సంతృప్తినివ్వదని ఆమె చెప్పుకొచ్చారు. తన అభిమానుల పట్ల తాను నిజాయితీగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇలా చేసినట్లు వెల్లడించారు. అంబానీ నుంచి 3.6 లక్షల ఆఫర్ ని ఎందుకు తిరస్కరించారో అనే విషయాన్ని ఆమె తన లింక్డ్ ఇన్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఇటీవల తనకు అంబానీ పీఆర్ బృందం నుంచి 3.6 లక్షల ఆఫర్ వచ్చిందని అన్నారు. అయితే ఈ పెళ్లి వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పెరుగుతుంది అనేది వీడియోలో మాట్లాడ్డమే తనకి ఇచ్చిన టాస్క్ అని అన్నారు. అయితే తనకు ఇస్తామన్న అమౌంట్ రెగ్యులర్ గా ప్రమోషన్స్ కోసం తీసుకునే 3 లక్షల కంటే ఎక్కువే అయినప్పటికీ ఇష్టం లేక ఒప్పుకోలేదని అన్నారు. తల్లిదండ్రులు కూడా ఆఫర్ ని అంగీకరించమని కోరారని కానీ నేను ఒప్పుకోలేదని కావ్య అన్నారు. గుంపులో గోవిందలా అందరూ చేసే పని తాను చేయనని.. అందరూ అనంత్ అంబానీ పెళ్లిని ప్రమోట్ చేస్తుంటే తాను కూడా చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. దీని వల్ల తన సొంత బ్రాండ్ మీద ఫాలోవర్స్ కి నమ్మకం పోతుందని అన్నారు. వైవిధ్యం, వాస్తవికతకు దగ్గరగా ఉండే తన కంటెంట్ కి తగ్గట్టు ప్రమోట్ చేసేవి కూడా దానికి దగ్గరగానే ఉండాలని కోరుకుంటా అని.. అవేమీ అంబానీ ఇచ్చిన ప్రమోషన్ లో కనిపించలేదని అన్నారు.
జియో ధరలను అమాంతం పెంచేసింది. ఈ క్రమంలో అంబానీ లాంటి కార్పొరేట్ దిగ్గజాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఆడియన్స్ ముందు తన నిజాయితీ పోతుందని కావ్య అన్నారు. నైతికత దెబ్బతినకూడదనే ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అలా అని ఆమె అంబానీకి వ్యతిరేకం అని కాదు. గతంలో ఆమె అనంత్ అంబానీ వంతారాని ప్రమోట్ చేశారు. అయితే పెళ్లి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేమని.. అందుకే పెళ్లి ప్రమోషన్ కి నిరాకరించానని ఆమె అన్నారు. 3.6 లక్షల డీల్ అనేది టెంప్టింగ్ గానే ఉంది. అయితే లాంగ్ టర్మ్ ప్రయోజనాలు చూసుకోవాలి కదా.. తక్కువ వ్యవధిలో వచ్చే డబ్బు కాదు కావాల్సింది.. నిజాయితీ ఉంటే లాంగ్ టర్మ్ లో నమ్మకమైన ఫాలోవర్స్ ఉంటారు. అది వెలకట్టలేనిది అంటూ కావ్య కర్ణాటక్ వెల్లడించారు. ఇలాంటి డీల్స్ కి నో చెప్పడం ఛాలెంజింగ్ విషయమే. కానీ అదృష్టవశాత్తు తాను ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకునే స్టేజ్ లో ఉన్నానని.. అందరూ నో చెప్పాలని.. చెప్పకూడదని కాదు.. ఇది వారి వారి వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇక ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి అంబానీ ఇచ్చిన ఆఫర్ ని ఈ యువతి తిరస్కరించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.