iDreamPost
android-app
ios-app

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం.. CM ని చంపేస్తాం.. పన్నూ హెచ్చరికలు

అయోధ్యలో మరోసారి ఉగ్ర కలకలం అలజడి రేపింది. నిన్న ముగ్గురు అనుమానిత ఉగ్ర వాదులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించాడు

అయోధ్యలో మరోసారి ఉగ్ర కలకలం అలజడి రేపింది. నిన్న ముగ్గురు అనుమానిత ఉగ్ర వాదులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించాడు

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం.. CM ని చంపేస్తాం.. పన్నూ  హెచ్చరికలు

శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగనున్నది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో చారిత్రాత్మక ఘట్టం ప్రారంభం కానున్నది. వందల ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రామ భక్తులకు కోదండ రాముని దర్శన భాగ్యం కలుగనున్నది. ఈ నెల 22న రామ్ మందిర్ ప్రారంభోత్సవం కారణంగా అక్కడి యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భద్రతా పరమైన చర్యల్లో మునిగిపోయాయి. దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకునే పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రామ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా అయోధ్యలో ఉగ్ర కుట్రలు కలకలం రేపుతున్నాయి. అయోధ్యలో విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారు ఉగ్ర వాదులు.

చారిత్రాత్మకమైన రామ్ మందిర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అయోధ్య నగరం సుందరంగా ముస్తాబైంది. రామ నామంతో దేశమంతా పులకించిపోతుంది. ఈ తరుణంలో అయోధ్యలో అనుమానితుల ఉగ్ర వాదుల అరెస్టు తీవ్ర కలకలం రేపుతోంది. ఖలిస్థానీ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా మరోసారి భారత్‌లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. రామ్ మందిర్ ప్రారంభోత్సవ సమయంలో దాడులకు పాల్పడుతామని యూపీ సీఎం ఆదిత్యానాథ్ ను చంపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశాడు. ఇప్పటికే అయోధ్యలో ఉగ్ర కలకలం రేపిన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

కాగా అయోధ్యలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయోధ్య నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అణువణువునా గాలిస్తున్న సమయంలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం అయోధ్యలో ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్-ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పన్నూ అయోధ్యపై, యూపీ సీఎంపై హెచ్చరికలు చేశాడు. యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను భద్రతా ఏజెన్సీలు వేధింపులకు గురి చేయొద్దంటూ ఓ ఆడియోను విడుదల చేశాడు. గతంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా పన్నూ భారత్ పై విషం చిమ్మిన విషయం తెలిసిందే. మరి ఖలిస్థానీ వేర్పాటు వాది చేసిన హెచ్చరికలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Khalistani terrorist threat in Ayodhya