హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు జీవిత ఖైదీలకు లా చదివేందుకు పర్మిషన్!

  • Author singhj Published - 04:32 PM, Wed - 8 November 23

ఒక కేసు విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు జీవిత ఖైదీలకు లా చదవేందుకు ధర్మాసనం పర్మిషన్ ఇచ్చింది. ఒక టాలీవుడ్ హిట్ ఫిల్మ్​లో మాదిరిగా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం వైరల్​గా మారింది.

ఒక కేసు విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు జీవిత ఖైదీలకు లా చదవేందుకు ధర్మాసనం పర్మిషన్ ఇచ్చింది. ఒక టాలీవుడ్ హిట్ ఫిల్మ్​లో మాదిరిగా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం వైరల్​గా మారింది.

  • Author singhj Published - 04:32 PM, Wed - 8 November 23

సినిమాల్లోని కథలు నిజజీవితానికి దగ్గరగా ఉండటం చూస్తూనే ఉన్నాం. చాలా మూవీ స్టోరీస్ రియల్​ లైఫ్​లోని ఘటనలను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కడం గురించే వినే ఉంటారు. నిజజీవితానికి సంబంధం లేకుండా రచయితల కలం నుంచి పుట్టిన కథలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇలాంటి సినిమాల్లోని ఘటనలు బయట కూడా జరగడం మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నంబర్ 1’ ఫిల్మ్ గుర్తుండే ఉంటుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్​లో మెమరబుల్​ హిట్​గా నిలిచిందీ మూవీ. జక్కన్న కెరీర్​లో ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఆడియెన్స్ మనసులు గెలుచుకున్న ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్​గా మంచి హిట్​గా నిలిచింది.

జూనియర్ ఎన్టీఆర్​ను హీరోగా నిలబెట్టింది ‘స్టూడెంట్ నంబర్ వన్’ మూవీనే. ఈ సినిమా తర్వాత మళ్లీ చేతులు కలిపిన రాజమౌళి-తారక్​లు ‘సింహాద్రి’ చిత్రానికి కలసి పనిచేశారు. ఈ మూవీ ఎక్స్​పెక్ట్ చేసిన దాని కంటే పెద్ద హిట్​గా నిలిచింది. ‘సింహాద్రి’ సూపర్ హిట్టవ్వడంతో తారక్ టాలీవుడ్ కొత్త స్టార్​గా అవతరించారు. ఓవర్​నైట్​లో ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక, ఆ తర్వాత ఎన్నో హిట్స్ అందించి పాన్ ఇండియా హీరోగా నిలబడ్డారు ఎన్టీఆర్. రాజమౌళి కూడా దేశం గర్వించదగ్గ దర్శకుడి స్థాయికి చేరుకున్నారు. అయితే వీళ్లిద్దరూ కలసి చేసిన తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ 1’లో హత్య కేసులో హీరో పాత్ర అరెస్టయి .. జైలు నుంచి లా చదవి లాయర్ అవుతాడు.

అచ్చం జక్కన్న మూవీని తలపించేలా ఒక ఘటన తాజాగా కేరళలో చోటుచేసుకుంది. మర్డర్ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన ఇద్దరు జీవిత ఖైదీలకు ఎల్​ఎల్​బీ చదివేందుకు కేరళ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. జైలులో నుంచే ఆన్​లైన్​లో పాఠాలు వినేందుకు జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, జస్టిస్ కౌసర్ ఎడప్పగత్​ల ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా జైలు శిక్ష లక్ష్యాల్లో సంస్కరణే కాకుండా పునరావాసం కల్పించడం కూడా అని నొక్కి చెప్పింది. ఖైదీల విద్యా హక్కు అనేది రెస్పెక్ట్​తో కూడిన మానవ హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. ఖైదీల్లో సమాజంలో తామూ ఒక భాగంగా ఉండాలనే భావన నెలకొనేందుకు చదువు ఎంతో దోహదం చేస్తుందని ధర్మాసనం తెలిపింది.

లా చదివేందుకు కోర్టు అనుమతించిన జీవిత ఖైదీలు ఇద్దరూ 2023-24 ఎడ్యుకేషనల్ ఇయర్​కు గానూ కేరళ లా ఎంట్రన్స్ కమిషన్ నిర్వహించిన ఎల్​ఎల్​బీ కోర్సు ఎంట్రన్స్ టెస్ట్​లో పాసయ్యారు. వీళ్లలో ఒకరు మలప్పురంలోని కేఎంసీటీ కాలేజీ మూడేళ్ల ఎల్​ఎల్​బీ కోర్సులో చేరారు. మరో ఖైదీ పూత్తోట శ్రీనారాయణ కాలేజీ ఐదేళ్ల లా డిగ్రీలో జాయిన్ అయ్యారు. మరి.. ఇద్దరు జీవిత ఖైదీలకు లా కోర్సు చదివేందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నిండు సభలో మహిళలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు.. దుమారం రేగడంతో..

Show comments