కేరళ వరద బాధితులకి స్టార్ హీరోయిన్ సాయం! మాతృభూమి ఋణం తీర్చుకుంటూ!

Kerala Floods 2024: కేరళ వరద బాధితులకి స్టార్ హీరోయిన్ సాయం! మాతృభూమి ఋణం తీర్చుకుంటూ!

Kerala Wayanad Floods 2024: వరదలు, వానలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఇప్పటికే 163 మంది జల సమాధి అయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Kerala Wayanad Floods 2024: వరదలు, వానలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఇప్పటికే 163 మంది జల సమాధి అయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. ఇటీవల కురిసిన వానలు, వరదలతో వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలు, కొండ చరియలు విరిగి పడటంతో జిల్లాలోని పలు గ్రామాలు బురద నీటిలో కూరుకుపోయాయి. వయనాడ్‌లోని ముండక్కై, చూరల్ మల, మెప్పడి ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 163 మంది మరణించారు. 88 మంది మృతదేహాలను గుర్తించారు. వీరిలో 32 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. అక్కడ సెర్చ్ అండ్ రెస్య్కూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తాయి. 2018 తర్వాత కేరళలో మరో పెను విపత్తు సంభవించింది. అక్కడ జన జీవనం అస్తవ్యస్థం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ విపత్తును చూసి సినీ ఇండస్ట్రీ నుండి కదలి వస్తుంది.

వయనాడ్‌లో వరదలు సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నటి తన మానవత్వాన్ని చాటుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వయనాడ్ సహాయక చర్యలలో పాల్గొంది నిఖిలా విమల్. వరదలు ముంచెత్తిన ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు డెలివరీ చేయడానికి డీవైఎఫ్ఐ ఓ సెంటర్ ఏర్పాటు చేసింది. తాలిపరంబ కలెక్షన్ సెంటర్‌కు వచ్చిన నిఖిలా వాలంటీర్‌గా మారి వస్తువులను ప్యాకింగ్ చేస్తుంది. అర్థరాత్రి నుండి రెస్య్యూ చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది నిఖిలా విమల్. డీవైఎఫ్ఐ అధికారిక పేజీలో ఈ వీడియో కనిపించింది. కేవలం ప్రార్థనలు, పోస్టులకే పరిమితం కాకుండా స్వయంగా ఆమె రంగంలోకి దిగడాన్ని ప్రశంసిస్తున్నారు.

డివైఎఫ్‌ఐ, యూత్ కాంగ్రెస్, యూత్ లీగ్, ఎఐవైఎఫ్ వంటి యువజన సంఘాలు, వాలంటీర్లు వయనాడ్‌లో సహాయక చర్యలను అందిస్తున్నారు. తాగునీరు, బిస్కెట్లు, బ్రెడ్, శానిటరీ నాప్‌కిన్లు, డైపర్లు, బట్టలు, దుప్పట్లు వంటి ఆహార పదార్థాలను సేకరించి శిబిరాలకు తీసుకువస్తున్నారు. వీటిని ప్యాక్ చేసి బాధిత ప్రాంతాలకు పంపిస్తోంది ఈ బృందం. ఇక నిఖిలా విమల్ విషయానికి వస్తే ఆమె సొంతూరు కేరళలోని కన్నూరు జిల్లాలోని తాలి పరంబ్. అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంది. తన మాతృభూమి బుణం తీర్చుకునేందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల గురువాయుర్ అంబలనడయిల్ మూవీతో హిట్ అందుకుంది నిఖిలా విమల్. ఇందులో పృధ్వీ రాజ్ భార్యగా నటించింది. ఆమె తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. నరేష్ హీరోగా వచ్చిన మేడ మీద అబ్బాయి, గాయత్రి వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి.

Show comments