ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్యాక్సీ సర్వీసులకు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు!

Cab Services: నేటి కాలంలో ట్యాక్సీ సర్వీస్ ల వినియోగం బాగా పెరిగింది. దీంతో వినియోదారుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఈ సర్వీసులపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వం ట్యాక్సీ సర్వీస్ లపై కీలక నిర్ణయం తీసుకుంది.

Cab Services: నేటి కాలంలో ట్యాక్సీ సర్వీస్ ల వినియోగం బాగా పెరిగింది. దీంతో వినియోదారుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఈ సర్వీసులపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వం ట్యాక్సీ సర్వీస్ లపై కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత కాలంలో ట్యాక్సీ సర్వీస్ ల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమ ప్రయాణం కోసం ఈ సర్వీసులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు ఈ ట్యాక్సీ సర్వీస్ అందిస్తున్నాయి. అయితే ఇవి వినియోదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈక్రమంలోనే  ఓ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సీ సర్వీస్ ధరలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ రాష్ట్రం, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం చాలా మంది  ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటు, నాన్ యాప్ బేస్ట్ ట్యాక్సీ సర్వీస్ లను వినియోగిస్తుంటారు. అంతేకాక ఈ సర్వీస్ లు వినియోదారుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తుంటాయనే ఫిర్యాదులు వస్తుంటాయి. ఇలాంటి ఫిర్యాదులు కేవలం ఒక రాష్ట్రం అనే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లో వస్తుంటాయి. అయితే ఈ ట్యాక్సీ సర్వీస్ ధరలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌ వంటి యాప్‌ ఆధారిత సంస్థలతో పాటు, నాన్‌-యాప్‌ బేస్డ్‌ ట్యాక్సీ సర్వీస్‌లకు స్థిరమైన ఛార్జీలను అమలుచేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ‘ఫిక్స్‌డ్‌ ఫేర్‌ రూల్‌’ పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణం ఈ ధరలు అమల్లోకి వస్తాయని ఆ రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్‌ సర్వీస్‌లను మూడు భాగాలుగా విభజించింది. వాహనం ధర రూ.10 లక్షల కంటే తక్కువైతే.. మొదటి 4 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.100. తర్వాత ప్రతి అదనపు కి.మీ. రూ.24 చెల్లించాల్సి ఉంటుంది. అలానే వాహనం ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటే.. కనీస ఛార్జీ రూ.115, అదనపు కిలోమీటర్లకు రూ.28గా నిర్ణయించారు. ఇక కారు ధర రూ.15 లక్షలు దాటితే తొలి 4 కి.మీ. కనీస ధర రూ.130. ఆ తర్వాత ప్రతి కి.మీ. రూ.32 తీసుకోవాలి.

అదే విధంగా క్యాబ్ బుక్ చేసిన తరువాత తొలి ఐదు నిమిషాల ఆలస్యంకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు నిమిషాల తర్వాత ప్రతి నిమిషానికి ఒక రూపాయి ఛార్జీ వర్తిస్తుంది. యాప్‌ ఆధారిత ట్యాక్సీ సర్వీస్‌ను అందించే సంస్థలు 5శాతం జీఎస్టీతో పాటు, టోల్‌ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతించారు. అలానే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీస్ లను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా 10శాతం వసూలు చేసుకోవచ్చని తెలిపింది. మరి.. ట్యాక్సీ సర్వీస్ ల అంశంపై కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments