Water Issue: బీ అలర్ట్.. నీటిని వృథా చేస్తే రూ. 5 వేలు జరిమానా..!

బీ అలర్ట్.. నీటిని వృథా చేస్తే రూ. 5 వేలు జరిమానా..!

ఎండ కాలం వచ్చేసింది. ఓ వైపు భానుడు భగభగ మండిపోతుంటే.. మరో వైపు నీటి సమస్య మొదలైంది. తాగు నీరు లేక పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ఎండ కాలం వచ్చేసింది. ఓ వైపు భానుడు భగభగ మండిపోతుంటే.. మరో వైపు నీటి సమస్య మొదలైంది. తాగు నీరు లేక పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ఎండకాలం మొదలైంది. చలికాలంలో గజ గజ వణికిన ప్రజలు.. ఇప్పుడు వేడిమి తాపానికి తట్టుకోలేకపోతున్నారు. ఇక దుప్పట్లకు టాటా చెప్పి.. ఏసీలు, కూలర్లకు పని కల్పిస్తున్నారు. మెల్లిగా సూరుడి ప్రతాపం చూపుతున్నాడు. క్రమ క్రమంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక సామాన్యులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు నీరు దొరక్క పలు ప్రాంతాల్లో ప్రజలు బిందెలు, బక్కెట్లతో రోడ్డ మీదకు వచ్చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్ ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరులో పరిస్థితి మరింత దిగజారుతుంది. తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

బెంగళూరులో నాలుగు రోజుల నుండి నీటి సరఫరా లేకపోవడంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వాటర్ ట్యాంక్ పిలుద్దామంటే ధరలు కూడా మండిపోతున్నాయి. పోనీ అవి సకాలంలో చేరుకుంటున్నాయా అనుకుంటే.. గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. గతంలో ట్యాంకర్ నీరు రూ. 650- రూ. 800 వరకు పలికేది. కానీ ఎండ కాలం రావడం, పలు చోట్ల నీరు లేక ప్రజలు ఇబ్బంది పడటాన్ని క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ట్యాంకర్ యజమానులు. ప్రస్తుతం వీటి ధరలు పదిహేను వందల రూపాయాల నుండి రూ. 2000 వేల వరకు పలుకుతుండటంతో..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనలేని పరిస్థితి ఏర్పడటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది కావేరీ నీటిని ఇటీవల తమిళనాడుకు విడుదల చెయ్యడం వల్లే ఈ కష్టాలు అంటూ మాట్లాడుకుంటున్నారు.

బెంగళూరులో నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. తాగు నీరు వృథా చేసిన వారికి రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ పామ్ మెడోస్ సొసైటీ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత 40 శాతానికి పెంచుతామని హెచ్చరించింది. నీటి వినియోగం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను సైతం నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ స్పందించారు. నగర వాసులకు నీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు.

Show comments