iDreamPost
android-app
ios-app

వీడియో: పార్లమెంట్ సభ్యుడి విందులో ఉచితంగా ‘మద్యం’.. ఎగబడిన స్థానికులు!

Karnataka BJP MP: ఓ ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా 'మద్యం' పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. దీనికి భారీ సంఖ్యలో మందుబాబులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం.

Karnataka BJP MP: ఓ ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా 'మద్యం' పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. దీనికి భారీ సంఖ్యలో మందుబాబులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం.

వీడియో: పార్లమెంట్ సభ్యుడి విందులో ఉచితంగా ‘మద్యం’.. ఎగబడిన స్థానికులు!

నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక కొందరికి అయితే మందుతాగనిదే రోజు ప్రారంభం కాదు. ఇక మద్యం తాగడం వలన కలిగే నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మద్యం వలన కలిగే అనార్థాల గురించి  చెబుతుంటారు. ఇది ఇలా ఉంటే.. కొందరు నేతలు మాత్రం ప్రజలకు స్ఫూర్తిగా ఉండాల్సింది పోయి.. వారి విరుద్ధుమైన పనులు చేస్తుంటారు.  మద్యం సరఫరాను ఆపాల్సిన ఓ ప్రజాప్రతినిధి తన ఇంట్లో జరిగిన విందులో ఫ్రీ మద్యం అందించాడు. దీంతో మందుబాబులతో పాటు జనం భారీగా ఎగబడ్డారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరగ్గా..తీవ్ర విమర్శలకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కె.సుధాకర్‌ ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్స్ చిక్కబళ్లాపుర్‌ లోక్ సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన స్థానిక ప్రజలతో కలవాలని, వారికి కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఫలితాలు వచ్చిన నెల రోజుల తరువాత తాజాగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమాని ఆయన మద్దతుదారులు  ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రోగ్రామ్ లోఉచితంగా మద్యం పంపిణీ  చేశారు. ఇక ఉచితంగా ఏది వచ్చిన వదిలి పెట్టని జనం.. ఇక మద్యం  అంటే అసలు ఆగుతారా.. ఫ్రీగా మందు పంపిణీ చేయడంతో.. దీనికి  స్థానిక జనం భారీగా ఎగబడ్డారు. అంతేకాక స్థానిక జనాలు భారీ ‘క్యూ’ లైను నిలబడి ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని అంతా పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఈ ప్రోగ్రామ్ బందోబస్తు నిర్వహించాలని ఎంపీ సుధాకర్‌ స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇక స్థానిక ఎంపీ చేసిన ఈ పనిపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనని ఆయన ఆరోపించారు. అంతేకాక ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇక నిబంధనలను అతిక్రమించి కార్యక్రమం నిర్వహించినందుకు మంత్రి పై చర్యలు తీసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. ఆ విషయం తరువాత అని..ముందు బీజేపీ నుంచి ఎటుంటి రియాక్షన్ ఉంటుందో చూడాలన్ని డీకే శివకుమార్ తెలిపారు. భాజపా ఎంపీ సుధాకర్ మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. దీనికి భారీ సంఖ్యలో మందుబాబులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి..కర్నాటక ఎంపీ అనుచరలు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.