iDreamPost
android-app
ios-app

చదువు పూర్తి కాకముందే గోల్డెన్ ఆఫర్.. ఏడాదికి ఏకంగా రూ.83 లక్షల జీతంతో ఉద్యోగం

బీటెక్ విద్యార్థినులు క్యాంపస్ ఇంటర్య్వూల్లో జాక్ పాట్ కొట్టారు. ఏకంగా రూ. 83 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొంది రికార్డ్ క్రియేట్ చేశారు. చదువు పూర్తి కాకుండానే గోల్డెన్ ఆఫర్ అందుకున్నారు.

బీటెక్ విద్యార్థినులు క్యాంపస్ ఇంటర్య్వూల్లో జాక్ పాట్ కొట్టారు. ఏకంగా రూ. 83 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొంది రికార్డ్ క్రియేట్ చేశారు. చదువు పూర్తి కాకుండానే గోల్డెన్ ఆఫర్ అందుకున్నారు.

చదువు పూర్తి కాకముందే గోల్డెన్ ఆఫర్.. ఏడాదికి ఏకంగా రూ.83 లక్షల జీతంతో ఉద్యోగం

జీవితంలో సక్సెస్ ఊరికే రాదు. చేసే పనిపట్ల శ్రద్ద, నిరంతర కృషి ఉంటేనే విజయాలు సొంతమవుతాయి. ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అంకితభావంతో ప్రయత్నిస్తే గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుతం సమాజంలో ఉన్న గొప్ప వాళ్లందరు ఎంతో కష్టపడి పైకొచ్చినవారే. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. దీన్ని నిజం చేస్తూ ఓ ఇద్దరు యువతులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులు గోల్డెన్ ఆఫర్ అందుకున్నారు. ఏడాదికి రూ. 83 లక్షల జీతంతో ఉద్యోగాలు పొంది సరికొత్త హిస్టరీని సృష్టించారు. దీంతో ఆ విద్యార్థినుల పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగుతోంది.

ప్రస్తుత సమాజంలో నిరుద్యోగం వెంటాడుతోంది. చదివిన చదువుకు సరైన ఉద్యోగాల్లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో అసలు చదువు పూర్తికాకుండానే భారీ వేతనంతో ఉద్యోగాలు పొంది సంచలనం సృష్టించారు ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్. భాగల్‌పూర్‌ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో బీటెక్ విద్యార్థినులు రికార్డు స్థాయి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. బీటెక్ థర్డ్ ఇయర్ (కంప్యూటర్ సైన్స్) చదువుతున్న ఇషికా ఝా, సంస్కృతి మాలవీయ అనే స్టూడెంట్స్‌ లక్కీ ఆఫర్ ను అందుకున్నారు. వీరిద్దరు ఏడాదికి రూ.83 లక్షల జీతం అందుకోనున్నారు. అంటే నెలకు రూ.7 లక్షల వరకు వేతనాన్ని పొందనున్నారు.

రూ.83 లక్షల వార్షిక వేతనంతో జాబ్ కొట్టిన ఇషికా ఝా హర్యానాకు చెందిన విద్యార్థిని. మరో స్టూడెంట్ సంస్కృతి మాలవీయది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న వీరు 4 ఏళ్ల బీటెక్ కోర్సు పూర్తి కాకముందే క్యాంపస్ ప్లేస్ మెంట్ లలో ఉద్యోగాలు అందుకున్నారు. 2021-2025 బ్యాచ్‌కు చెందిన ఇషికా ఝా, సంస్కృతి మాలవీయలు భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీలో చేరిన నాటి నుంచే ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగారు. ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్‌ నేర్చుకోవడంపై దృష్టిసారించారు. చివరికి వారి కృషి ఫలించింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికైన ఇషికా ఝా, సంస్కృతి మాలవీయలపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.